మన్మోహన్ సింగ్ కు భారత రత్న …

57
582

దేశానికి నిస్వార్థ సేవలందించిన మచ్చలేని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కు భారత రత్న ఇవ్వాలని కాంగ్రెస్ పీనియర్ నేత పి.చిదంబరం డిమాండ్.

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ ఇవాళ 88వ వసంతంలోకి అడుగుపెట్టారు. పలువురు ప్రముఖులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’ ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ‘‘ఈ రోజు మన్మోహన్ సింగ్ పుట్టిన రోజు. మంచి ఆరోగ్యంతో దేశానికి మరి కొన్ని రోజులు సేవలు చేయాలని కోరుకుంటున్నా. ఆయన జీవితమంతా వినయపూర్వకంగా సాగింది. విద్యార్హతలు, మేధో సంపత్తితోనే ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు. దేశం మొత్తానికి ఆయన రోల్ మాడల్. జీవించి ఉన్న వారిలో ఎవరైనా భారత రత్నకు అర్హులంటే నిస్సందేహంగా మన్మోహన్ సింగే’’ అని చిదంబరం ట్విట్టర్ లో పేర్కొన్నారు.

https://twitter.com/PChidambaram_IN/status/1309748869220069377

ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ ట్విట్టర్‌ వేదికగా మాజీ ప్రధానికికి శుభాకాంక్షలు తెలిపారు. ‘డాక్టర్ మన్మోహన్ సింగ్ జీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయనకు సుదీర్ఘమైన, ఆరోగ్యకరమైన జీవితం లభించాలని సర్వశక్తిమంతుడిని ప్రార్థిస్తున్నాను’ అంటూ మోదీ ట్వీట్‌ చేశారు.మీ వంటి వ్యక్తి ప్రధానిగా లేకపోవడంతో భారతదేశం లోటుగా భావిస్తోంది. ఆయన నిజాయతీ, మర్యాద, అంకితభావం మనందరికి స్ఫూర్తిగా నిలుస్తాయి. ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను అంటూ రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు.

57 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here