అమెరికా చూసిన అత్యంత చెత్త అధ్యక్షుడు ట్రంప్ .. డిబేట్ లో బైడన్

65
738

మెరికా ఎన్నికల్లో అత్యంత కీలక ఘట్టమైన అధ్యక్ష అభ్యర్థుల డిబేట్ ప్రారంభమైంది. రాబోయే ఎన్నికల అభ్యర్థులుగా ఉన్న డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి బైడెన్‌, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ డిబేట్ లో పాల్గొన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో ఇది మొదటి ప్రత్యక్ష చర్చ. అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఎంపికలో వచ్చిన ఆరోపణలు, విమర్శలపై మొదటి ప్రశ్నతో ముఖాముఖి ప్రారంభమైంది. అమెరికాలో ఎన్నికలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని బైడెన్‌ అన్నారు. ఇప్పటికే వేల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని వ్యాఖ్యానించారు. ఒబామా కేర్ పాలసీని ట్రంప్ నాశనం చేశారని మండిపడ్డారు.

బైడెన్‌ వ్యాఖ్యలను ట్రంప్‌ ఖండిస్తూ.. గత ఎన్నికల్లో గెలిచాం కాబట్టే సుప్రీంకోర్టు నియామకాల్లో తమ ప్రభుత్వానికి పూర్తి స్వేచ్ఛ ఉందని స్పష్టం చేశారు. తనను మూడేళ్ల కోసం ఎన్నుకోలేదని ధీటుగా సమాధానం ఇచ్చారు. అధ్యక్ష అభ్యర్థుల చర్చ వాడివేడిగా కొనసాగింది.ట్రంప్‌ తెచ్చిన హెల్త్‌స్కీమ్‌పై ఇరువురి మధ్య చర్చ జరిగింది. ఒబామా కేర్‌కు ప్రత్యామ్నాయం ఎందుకు తీసుకురాలేక పోయారని బైడెన్‌ సూటిగా ప్రశ్నించారు. ఒబామా కేర్‌ను రద్దు చేయడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారని ఆయన విమర్శించారు. దానికి బదులుగా.. తమ ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తోందని ట్రంప్‌ తెలిపారు. మందుల ధరలు గణనీయంగా తగ్గాయని గుర్తు చేశారు.

కారోనా పై కూడా ఇద్దరి మధ్య వాడి వేడి చర్చ జరిగింది. కరోనాను కట్టడి చేయటంలో ట్రంప్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బైడెన్ ఆరోపించారు. బైడెన్, ట్రంప్ ఎన్నికల చర్చపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి చూపుతున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం 90 నిమిషాల పాటు సాగింది.

65 COMMENTS

  1. Hеy! I coսld һave sworn I’ve beenn to this wwbsite ƅefore but after reading thrоugh some of
    the post I realized it’s neѡ to me. Nonetheleѕs, I’m definitely happy I
    fоund it annd I’ll bbe book-marking and checking baᴢck frequently!

    my website :: online dating sites

  2. Have you ever heard of second life (sl for short). It is essentially a video game where you can do anything you want. SL is literally my second life (pun intended lol). If you would like to see more you can see these Second Life articles and blogs

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here