అందులో కనిపించనంటున్న కల్పిక..

0
84

బిగ్ బాస్ 4 సీజన్ కి టైం దగ్గర పడుతోంది. హడావుడి పతాక స్థాయికి చేరింది. కింగ్ నాగార్జున దీనికి హోస్ట్ గా వ్యవహరిస్తుండటంతో జోష్ మరింత పెరిగింది. ఈ రియాలిటీ షోలో పాల్గొనాలని చాలా మందికి ఉంటుంది. కాని నటి కల్పిక మాత్రం నో నో అంటోంది.


జీ5 వారి లూజర్ లో తన పర్ఫామెన్స్ తో అందరిని ఆకట్టుకున్న నటి కల్పికకు అవకాశాలు పెరిగాయి. అయితే ఇటీవల ఆమె బిగ్ బాస్ 4లో పాల్గోంటుందన్న వార్తలు షికార్లు చేశాయి. కాని ఆమె ఆ వార్తలను కొట్టి పారేసింది.


బుల్లితెర హిట్ షో బిగ్‌బాస్ అంటే ప‌డి చ‌చ్చే వాళ్లు చాలామందే ఉంటారు. అయితే అందులో భాగస్వా‍మ్యం కావాలంటే మాత్రం అటు సినీ సెల‌బ్రిటీలు, ఇటు టీవీ న‌టీన‌టులు వెనకా ముందు ఆలోచిస్తుంటారు. ఎందుకంటే బిగ్‌బాస్ పార్టిసిపెంట్ల‌ను ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసి వారి పాపులారిటీని రెట్టింపు చేస్తుంది. అయితే ఒక్కో సారి ఇది రివర్స్ కూడా అవుతుంది. ముఖ్యంగా అంతో ఇంతో పేరున్న తారలకు ఈ రిస్క్ ఎక్కువ. ఏమాత్రం తేడా వ‌చ్చినా ఉన్న ఇమేజ్‌ను కూడా నాశ‌నం చేస్తుంది.


గ‌త సీజ‌న్ల‌ను చూస్తే సినీ ప‌రిశ్ర‌మ నుంచి వ‌చ్చే సెల‌బ్రిటీల‌కు బిగ్‌బాస్ త‌ర్వాత అవ‌కాశాలు ఆగిపోయిన ఘ‌ట‌న‌లు ఉన్నాయి. హౌస్‌లోనూ వారు అప్ప‌టిదాకా సంపాదించుకున్న అభిమానం, పాపులారిటీని కాపాడుకునేందుకు ప్ర‌తిక్ష‌ణం పోరాడాల్సి ఉంటుంది.


ఇవన్నీ చూసిన కల్పిక ముందు జాగ్రత్తగా బిగ్ బాస్ కి దూరం జరిగింది. ఆ గోతిలో ప‌డ‌నని న‌టి క‌ల్పిక గ‌ణేష్ క‌రాఖండిగా చెప్తోంది. దీనిపై న‌టి స్పందిస్తూ అది ఎప్ప‌టికీ ఊహ‌లుగానే మిగిలిపోతాయి కానీ, నిజం కాలేవ‌ని తేల్చి చెప్పింది. ఇప్ప‌టికీ, ఎప్ప‌టికీ తాను బిగ్‌బాస్‌లో అడుగు పెట్ట‌ను అని స్ప‌ష్టం చేసింది.


దశాబ్దం క్రితం ‘ప్ర‌యాణం’ సినిమాతో వెండితెర‌పై తెరంగ్రేటం చేసిన క‌ల్పిక.. ‘సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు’, ‘సీత ఆన్ ద రోడ్’ సహా డజనుకు పైగా చిత్రాలలో నటించింది.


కల్పిక గణేష్ కి మోడలింగ్ లో కూడా ప్రవేశిం ఉంది. పలు కమర్షియల్ ప్రకటనలు చేసింది. కొన్ని వెబ్ సిరీస్ లలో నటించింది. తన పదకొండేళ్ల సినీ ప్రయాణంలో ఇప్పుడిప్పుడే మంచి అవకాశాలు అందిపుచ్చుకుంటోంది. పలు ప్రాజెక్టులు చేతిలో ఉన్న ఈ దశలో బిగ్ బాస్ ఎందుకు అనుకుంది. ఇదంతా చూస్తే కల్పిక నిర్ణయం సరైనదే అనిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here