రెండు రోజుల క్రితం మహిళల గురించి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ విజయ్ పి. నాయర్ అనే ఓ ప్రబుద్ధుడు యూట్యూబ్ లో వీడియో పోస్ట్ చేశాడు. దీనిపై. సినీ ఆర్టిస్ట్ భాగ్యలక్ష్మి, మహిళా కార్యకర్తలు శ్రీలక్ష్మి అరక్కల్, దియా సనా తదితరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ వారి నుంచి సరైన ప్పందన కనిపించలేదు. దాంతో వారు తీరువనంతపురంలోని ఆ యూట్యూబర్ ఇంటికి వెళ్లి తగిన బుద్ది చెప్పారు. ఈ చర్యకు పూనుకున్న భాగ్యలక్ష్మి ఇతర మహిళలకు ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఆరోగ్య , సామాజిక న్యాయ మంత్రి కె కె శైలజతో పాటు పౌర సమాజంలోని పలువురు మద్దతుగా నిలిచారు. పోలీసుల తీరుతో విజయ్‌పై దాడి చేయడం తప్ప తమకు మరో మార్గం లేదని భాగ్యలక్ష్మి మీడియాతో అన్నారు.
ఆన్లైన్ దుర్వినియోగ ఫిర్యాదుపై పోలీసులు వ్యవహరిస్తున్న తీరుకు విసుగు చెంది అతని నివాసంలోకి ప్రవేశించి, అతన్ని కొట్టటమే కాదు లైవ్ వీడియోలో క్షమాపణలు చెప్పించా రు. అతని ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు. నాయర్ తనను క్లినికల్ సైకాలజిస్ట్ అని చెప్పుకుంటాడు. సినీ కళాకారులపై అసభ్యకర వ్యాఖ్యలతో వీడియో లను తరచుగా అప్లోడ్ చేయటం ఇతని హాబీ. ఈ ఘటనతో ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ క్లినికల్ సైకాలజిస్ట్స్ కేరళ చాప్టర్ విజయ్ సైకాలజిస్ట్ కాదని తమ సంస్థతో ఎలంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.