మహిళా దర్శకురాలు రూపొందించిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘ఆకం’

0
62

పురుషాధిక్య సినీ ప్రపంచంలో మహిళా దర్శకురాళ్లు చాలా తక్కువ. అందునా మళయాల సినీ రంగంలో మరీ తక్కువ. ఒక వేళ మహిళా దర్శకులు సినిమా తీసినా అదేదే ఫ్యామిలీ డ్రామా.. లవ్ ట్రయాంగిల్ సినిమాలను మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ సైకలాజికల్ థ్రిల్లర్ని ఎవరూ ఆశించరు. కానీ మళయాళంలో 2013లో వచ్చిన “ఆకం” సినామా ఓ సైకలాజికల్ థ్రిల్లర్.. చిత్ర దర్శకురాలు షైలిని ఉషా నాయర్ . 1967 లో మళయాత్తూర్ రామకృష్ణన్ రాసిన “యక్షి” అనే నవల అధారంగా ఆమె ఈ చిత్రాన్ని రూపొందించారు. ఫాహద్ ఫాసిల్, అనుమోల్ ప్రధాన పాత్రదారులు.


శ్రీనివాసన్ ఒక పెద్ద కంపెనీలో ఆర్కిటేక్ట్. మంచి ఉద్యోగం, మంచి అందమైన గర్ల్ ప్రేండ్ తో జీవితం చక్కగా సాగుతున్నప్పుడు ఒక ప్రమాదం జరుగుతుంది. గర్ల్ ప్రేండ్ తో కారులో ప్రయాణీస్తున్నప్పుడు ఆక్సిడెంట్ అయి ఆ ప్రమాదంలో అతని మొహం వికృతంగా మారిపోతుంది. కాలుకి దెబ్బ తగిలి కుంటి నడక అతని సొంతమవుతుంది. చిన్న దెబ్బలతో బైటపడిన అతని ప్రేయసి తన సొంత ఊరులో కోలుకుంటూ ఉంటుంది. ఇతని ఫోన్లకు ఆమె రెప్సాన్స్ ఇవ్వదు. అన్ని పోగొట్టుకున్న శ్రీనివాసన్ జీవితం పట్ల సినికల్ గా మారతాడు.


అప్పుడే అతని జీవితంలో రాగిణి అనే అందమైన అమ్మాయి ప్రవేశిస్తుంది. ఎపుడు ఒంటరిగా ఉండే ఈమె ను చూడగానే ఆకర్షితుడవుతాడు శ్రీనివాసన్. ఆమె కూడా అతని ప్రేమను స్వీకరిస్తుంది. ఇద్దరూ వివాహం చేసుకుంటారు. కాని శ్రీనివాసన్ మాత్రం ఈ వివాహం తరువాత భార్య పట్ల ఒక వింత అనుమానం తో జీవిస్తూ ఉంటాడు. ఆమె మనిషి కాదని ఒక యక్షి అని అతను నమ్మడం మొదలెడతాడు. ఆమె నెత్తి మీద మేకుతో కొట్టీ ఆమెను తాను చంపకపోతే తనను ఆమె చంపుతుంది అని నమ్మడం మొదలెడతాడు. ఆమె తననుండి చాలా దాస్తుందని. ఆమె మనిషి అయ్యే ప్రసక్తే లేదని నమ్మి ఆమెను గాయపరుస్తాడు కూడా. కాని అతని స్నేహితుడు అతను అనవసర భయాలతో జీవితాన్ని పాడు చేసుకుంటున్నాడని, రాగిణి కి అంతకు ముందే ఒక వివాహం జరిగిందని ఆ బాధ నుండి బైటపడడానికే ఒంటరితనాన్ని ఆశ్రయిస్తుంది తప్ప ఆమె పట్ల భయపడాల్సింది ఏం లేదని చెప్తాడు. కొంత నమ్మినట్లున్నా శ్రీనివాసన్ లోని భయం దూరం కాదు. ఆమె ఊరు వెళ్ళి ఆమెని తీసుకు వద్దాం అని వెళ్ళీన శ్రీనివాసన్ ఆమెతో నది ఒడ్డుకు విహారానికి వెళతాడు. మరుసటి రోజు ఆమె ఆ నదిలో శవం అయి కనిపిస్తుంది.


సినిమా చివరి దాకా ఆమె నిజంగా యక్షినా లేదా అతనిలో ఏమైనా మానసిక రుగ్మత ఉందా అన్నది స్పష్టం కాదు. కథ మొత్తం శ్రీనివాసన్ భయానికి సంబంధించి ఉంటుంది. ఆ భయం అతన్ని ఎలా తినేస్తుంది. ఒక మంచి చలాకి అయిన వ్యక్తి జీవితం అంతకు ముందు జరిగిన ప్రమాదంతో, తన ప్రస్తుత అనాకారి తనంతో, పైగా భార్య పై అనుమానం, భయాలతో ఎలా భయానకంగా మారిపోయిందో చెప్పడం పైనే దర్శకుడు కథను నడిపించారు.

మంచి సస్పెన్స్ తో సాగిన ఈ సినిమా రోటీన్ చిత్రాలకు భిన్నంగా ఉంది. ముగింపు మాత్రం ప్రేక్షకులకే వదిలేసారు. సినిమా లో ఫోటోగ్రఫీ మిగతా రొటీన్ చిత్రాలకు భిన్నంగా ఉండి సినిమా కథకు ఒక మూడ్ ను ఇస్తుంది. మనం ఆ భయాన్ని ఫీల్ అవుతాం, శ్రీనివాసన్ పై జాలి పడతాం, నిజంగా ఏదో రహస్యం ఉందని ఆఖరు దాకా నమ్ముతాం. సినిమాలోని ఫోటోగ్రఫీ తో ఆ రహస్యాత్మక ఫీల్ ని దర్శకుడు బాగా తీసుకురాగలిగారు. ఓ మహాళా దర్శకురాలి నుంచి ఇలాంటి సినిమా రావటం నా వరకైతే నిజంగా ఆశ్చర్యమే..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here