ఎవరు బంధువులు ….ఎవరు స్నేహితులు..? సిటీలో బతకలేక ఊరెళితే…

0
93

కరోనా కాలంలో సిటీలో బతకలేక సొంత ఊరు వెళ్లింది ఓ కుటుంబం. కాని ఊరిలో వారికి ఇంత నీడ దొరకలేదు. కరోనా భయంతో బంధువులు వెలేశారు. దాంతో ఊరుకు దూరంగా పొలాల్లో గూడారం వేసుకుని కాలం వెళ్లదీస్తోంది ఆ కుటుంబం. ఈ ఉదంతం నల్లగొండ జిల్లాలో జరిగింది.


రోనా మహమ్మారి కారణంగా హైదరాబాద్ నుండి తమ సొంత గ్రామానికి తిరిగి వచ్చిన ఒక కుటుంబంలోని ఎనిమిది మంది సభ్యులు ఇప్పుడు వ్యవసాయ క్షేత్రాలలో ననివసించాల్సిన పరిస్థితి వచ్చింది. వారి బంధువులు ఎవరూ వసతి కల్పించడానికి సిద్ధంగా లేక పోవటమే వారి ఈ దుస్థితికి కారణం. కట్టంగూర్ చెందిన అరవై ఏళ్ల ఎరుకల యాదగిరి జీవనోపాధి కోసం 30 సంవత్సరాల క్రితం హైదరాబాద్‌కు వలస వెళ్లారు. డ్రైవర్‌గా పనిచేస్తూ, కొంత డబ్బు సంపాదించాడు. బ్యాంకుల నుండి రుణం తీసుకొని తన ట్రావెల్ ఏజెన్సీని ఏర్పాటు చేయడానికి రెండు మినీ బస్సులను కొన్నాడు. కోవిడ్ -19 లాక్డౌన్ తరువాత, అతను నెలకు 6,000 రూపాయల ఇంటి అద్దెను కూడా చెల్లించలేకపోయాడు. అలాగే మినీ బస్పుల ఇఎమ్ఐల చెల్లింపు కూడా ఆగిపోయింది. దీంతో అతను తన ఏడుగురు కుటుంబ సభ్యులతో కలిసి స్వస్థలం కట్టంగూర్ తిరిగి వెళ్లాలనుకున్నాడు. అక్కడ తమ బంధువులు, ఊరు వారు ఆశ్రయం ఇస్తారని ఆశించాడు. కాని జూలై 7 న గ్రామానికి చేరుకున్న కొద్ది గంటల్లోనే అతని ఆశలు అడియాసలయ్యాయి. కలలు చెదిరిపోయాయి.


యాదగిరి తన పూర్వీకుల నుంచి సంక్రమించిన ఇంటిని సోదరుడికి అమ్మేశాడు. దాంతో ఆశ్రయం కోసం అతను తన బంధువుల ఇళ్ల తలుపు తట్టాడు. కాని అతని కుటుంబానికి ఆశ్రయం ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఆ సమయంలో అత్యధిక సంఖ్యలో కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కావటమే వారి భయాలకు కారణం. దీంతో వేరే గత్యంతరం లేక అతని కుటుంబం నల్గొండ రహదారికి సమీపంలో ఉన్న వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లి ఒక చిన్న గుడిసె ఏర్పాటు చేసుకున్నారు. రెండు నెలలుగా అక్కడే ఉంటున్నారు. గుడిసెను నిర్మించటానికి ముందు వారు మినీ బస్సులో వారానికి పైగా ఉన్నారు. తన బంధువులు, గ్రామస్తులు ఇలా చేస్తారని హించలేదని యాదగిరి వాపోయాడు. నిజానికి తన పొలంలోనే సొంత ఇల్లు కట్టుకోవాలనుకున్నాని అయితే ఇప్పుడు తన ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు యాదయ్య.

ఇలాంటి అనుభవాలు ఒక్క యాదగిరి కుటుంబానికే కాదు..ఇంకా చాలా గ్రామాల్లో ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. కరోనా విషయంలో బయపడటం తప్పు కాదు.. కానీ అలా వదిలేయటమే తప్పు. ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు వారికి కోవిడ్ టెస్టు చేయించి కొద్ది రోజులు క్వారంటైన్ లో ఉంచితే సరిపోయేది. కాని మన గ్రామాలలో ఇంకా అంత అవేర్ నెస్ రాలేదని ఇలాంటి ఉదంతాలను చూపినప్పుడు మనకు అర్థమవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here