వ్యవసాయ సంస్కరణలు ..భవిష్యత్ భయాలు..

55
320

వ్యవసాయం, మార్కెటింగ్‌కు సంబంధించి మూడు కేంద్ర ఆర్డినెన్సులు జూన్‌లో జారీ అయినప్పటి నుండి…రైతు సంఘాలు, రైతులు తమ హక్కులపై తీవ్రంగా దాడి జరుగుతోందంటూ నిరసన తెలియ చేస్తూనే వున్నారు. హర్యానా, పంజాబ్‌, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు సాగుతున్నాయి. ఇంతలా వ్యతిరేకత వ్యక్తమైనా ప్రభుత్వం వాటిని పట్టించుకోకుండా ఆ మూడు ఆర్డినెన్సుల స్థానే మూడు బిల్లులు తీసుకువస్తోంది. వాటిలో రెండిండికి పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం కూడా లభించింది.

ఆహార ధాన్యాలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను నిత్యావసరాల జాబితా నుండి తొలగించడం, నిల్వల పై పరిమితులను ఎత్తివేయడం, రాష్ట్రాల్లో వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌ కమిటీలను పక్కకు పెట్ట డం, వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి అంతర్రాష్ట వాణిజ్యం, రవాణాకు అనుమతించడం, కాంట్రాక్ట్‌ వ్యవసాయానికి చట్టబద్ధమైన చట్ర పరిధిని రూపొందించడం వంటి అంశాలు ఈ బిల్లులలో వున్నాయి. వీ టిన్నింటినీ కలిపి చూసినట్లైతే, బడా వ్యాపారవేత్తలు, కార్పొరేట్‌ సంస్థలు, అగ్రి బిజినెస్‌ సంస్థలు రైతాంగా న్ని పెద్ద ఎత్తున దోపిడీ చేయడానికి ఒక నిబంధనావళిని రూపొందిస్తున్నట్లు వుంది.

వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ చేయడం, గ్లోబల్‌ మార్కెట్‌తో భారతదేశ వ్యవసాయ రంగాన్ని మిళితం చేయడానికి వీలు కల్పించడం, సేకరణ, కనీస మద్దతు ధర యంత్రాంగానికి విఘాతం కలిగించడం వంటి చర్యలను ప్రోత్సహించడానికి ఉద్దేశించినన త్రిశూలం వంటి ఈ మూడు బిల్లులు ఆహార భద్రత లేకుండా పోవడానికి దారి తీస్తాయి.

నిత్యావసర సరుకుల చట్టానికి చేస్తున్న సవరణ వల్ల పప్పు ధాన్యాలు, కాయ ధాన్యాలు, ఖాద్య తైలా లు, ఉల్లిపాయలు, బంగాళా దుంపలు…ఇవన్నీ కూడా నిత్యావసర సరుకుల జాబితా నుండి తొలగిం చబడతాయి. పైగా వీటి నిల్వలపై పరిమితులను కూడా ఎత్తివేస్తారు. అసాధారణ రీతిలో ధరల పెరుగు దల వున్నా లేక యుద్ధం మరే ఇతర అసాధారణ సంఘటనలు చోటు చేసుకున్నపుడు మాత్రమే పరిమి తులు విధిస్తారు. ఈ సవరణ వల్ల బడా వ్యాపారస్తులు, కార్పొరేట్లు, అగ్రిగేటర్లు, ప్రాసెసర్లు…వీరందరూ కూడా పెద్ద మొత్తంలో వ్యవసాయ ఉత్పత్తులు నిల్వ చేసుకోవడానికి వీలు కలుగుతుంది.

ఇక రెండో బిల్లు ఎపిఎంసి ని పక్కకు నెట్టడానికి ఉద్దేశించినది. ఎపిఎంసి యార్డ్‌ల వెలుపల ఏర్పాటు చేసిన వేదికల దగ్గర లేదా నేరుగా రైతుల నుండి వర్తకులు, కంపెనీలు ఉత్పత్తులను కొనుగోలు చేసుకోవచ్చు. ఈ లావాదేవీలపై ఎలాంటి పన్నులు వేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం వుండదు. కాంట్రాక్ట్‌ వ్యవసాయాన్ని ప్రోత్సహించడంతో పాటుగా రైతుల నుండి తాము చెప్పిన లేదా అనుకున్న రేటుకే ఉత్పత్తులు కొనుగోలు చేయడానికి అగ్రి బిజినెస్‌ కంపెనీలు, బడా వ్యాపారస్తులకు ఈ ఆర్డినెన్సు అవకాశం కల్పిస్తుంది.

రైతుకు స్వేచ్ఛ కల్పిస్తున్నామని బయటకు చెబుతున్నప్పటికీ, వాస్తవానికి ధరలు ఎలా వుండాలో రై తుకు నిర్దేశించేందుకు బడా వ్యాపారస్తులు-కార్పొరేట్‌ సంస్థలకు స్వేచ్ఛ వుంటుంది. ఎపిఎంసి ల పని తీరు, నిత్యావసరాల చట్టానికి సంబంధించి కూడా సమస్యలు వున్నాయి. వ్యవసాయం అనేది రాష్ట్రానికి సంబంధించిన సమస్య అయినందున రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఈ సమస్యలను పరిష్కరించడానికి బదు లుగా వ్యవసాయ వాణిజ్య సంస్థలు, కార్పొరేట్లు, బడా వ్యాపారస్తుల ప్రయోజనాలను పెంపొందించాలనే మోడీ ప్రభుత్వం నిర్ణయించింది.

ఎపిఎంసి లు అనేవి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ అంశమైనందున దీనికి సంబంధించిన బిల్లు కేంద్ర చట్టం పరిధికి వెలుపల వుంది. అయినప్పటికీ, బిల్లును ఆమోదింపచేసుకుని ప్రభుత్వం ముందుకు సాగు తోంది. ఇదొక నమూనాగా తీసుకుని, ఎపిఎంసి లపై రాష్ట్ర ప్రభుత్వాల చట్టాలకు సవరణలు చేయాల్సిం దిగా బిజెపి రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఉత్తరప్రదేశ్‌, హర్యానా, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌లు ఇప్పటికే సవరణలు చేశాయి.

రాష్ట్ర స్థాయి ఆర్డినెన్సులు, చర్యలు తీసుకోవడం ద్వారా కార్మిక చట్టాలను కూడా మార్చడం లేదా రద్దు చేయడానికి ఇదొక మార్గం. ఆత్మ నిర్భర భారత్‌ ప్రచారం ముసుగులో వివిధ నయా ఉదారవాద చర్యలను మోడీ ప్రభుత్వం చేపడుతోంది. ఈ పేరుతో వ్యవసాయం, గ్రామీణ మౌలిక సదుపాయాల రంగానికి ప్రకటించిన చర్యలన్నింటి వల్ల వాస్తవానికి రైతులకు పెద్దగా మేలు చేసిందేమీ లేదు.

ఫార్మ్‌ గేట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన, పశు సంవర్ధక శాఖ అభివృద్ధి నిధి ఇలా ఇవన్నీ కూడా వాస్తవానికి ప్రస్తుతమున్న పథకాలకు కొత్త ముసుగు వేసినవి లేక 2019-20, 2020-21 కేంద్ర బడ్జెట్‌ల్లో ప్రకటించినవో తప్ప మరేమీ కాదు. వీటిపై అదనపు వ్యయం రూ.5 వేల కోట్లు కూడా లేదు. కార్యాచరణలో కుదించబడిన పార్లమెంట్‌ను మనం చూస్తున్నాం. ఏ బిల్లులను కూ డా సంబంధిత స్థాయీ సంఘాలకు పంపడానికి ప్రభుత్వం నిరాకరిస్తోంది. చర్చకు కేటాయించే సమ యాన్ని తీవ్రంగా కుదించివేయడంతో బిల్లులన్నీ బలవంతంగా ఆమోదం పొందుతున్నాయి. ప్రస్తుతం మోడీ ప్రభుత్వానికి కరోనా ఒక మంచి అవకాశంగా మారింది. పార్లమెంట్‌ సక్రమంగా పరిశీలించడానికి లేదా చర్చించడానికి అవకాశం లేకుండానే రైతాంగ, కార్మిక వ్యతిరేక బిల్లులన్నీ ఆమోదించేలా మోడీ సర్కార్‌ ప్రయత్నిస్తోంది.
( ‘పీపుల్స్‌ డెమోక్రసీ’ సంపాదకీయం నుంచి )

55 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here