మీడియా పాయింట్ ఎత్తి వేయటం ఇప్పుడు ఇఫ్యూగా మారింది. అసెంబ్లీలో మీడియా పాయింట్ ఎత్తివేయడంపై బీఏసీ సమావేశంలో సీఎం కేసీఆర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క మధ్య చర్చ జరిగింది. అసెంబ్లీ ఆవరణలో మీడియా పాయింట్ ఎత్తివేయడాన్ని భట్టి విక్రమార్క తప్పుబట్టారు. దీనిపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. కొవిడ్ వ్యాప్తి దృష్ట్యానే మీడియా పాయింట్‌ను ఎత్తేయాల్సి వచ్చిందని కేసీఆర్ స్పష్టం చేశారు. సభ కంటే మీడియా పాయింట్ ఎక్కువైందా? అని భట్టిని ఉద్దేశించి సీఎం ప్రశ్నించారు. సభ్యుల సంఖ్య ప్రకారం సభలో సమయం ఇస్తామని.. దాని ప్రకారం సభ్యులు నడుచుకుని తమ సమస్యలను వినిపించాలని సీఎం సూచించారు. కాంగ్రెస్ నాయకులు అబద్దాలు మాట్లాడుతూ.. ప్రజలను గందరగోళ పరుస్తున్నారని, ఆ విషయాలను సభలో ప్రస్తావిస్తామని కేసీఆర్ తెలిపారు.