బహుళ ప్రాచుర్యం పొందిన టిక్ టాక్ పై అమెరికాలో నిషేదం నీడలు కమ్ముకున్నాయి. టిక్ టాక్ జాతీయ భత్రతకు ముప్పుగా అమెరికా బావిస్తోంది. అమెరికా వినియోగదారుల సమాచారాన్ని టిక్‌టాక్ సంస్థ చైనా ప్రభుత్వానికి చేరవేస్తోందన్నది అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న వాదన. ఈ నేపథ్యంలో వెంటనే అమెరికాలో టిక్‌టాక్ కార్యకలాపాలు విక్రయించాలని, లేదంటే నిషేధం తప్పదని అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల హెచ్చరించిన సంగతి తెలిసిందే.. అంతేకాదు టిక్‌టాక్‌ను విక్రయించేందుకు సెప్టెంబర్ 15 వరకు గడువును కూడా విధించారు. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్‌తో కలిసి టిక్‌టాక్‌ను కొనుగోలు చేసేందుకు దిగ్గజ సంస్థ వాల్‌మార్ట్ సిద్ధమైంది. అందుకు సమాలోచనలు జరుపుతున్నట్లు వాల్‌మార్ట్ అధికారికంగా ప్రకటించింది. మైక్రోసాఫ్ట్, టిక్‌టాక్‌తో చేసుకోనున్న ఈ ఒప్పందంతో తమ అడ్వర్టైజింగ్ వ్యాపారాన్ని మరింత పెంచుకోవడానికి దోహదం చేస్తుందని వాల్‌మార్ట్ భావిస్తోంది. అయితే వాల్‌మార్ట్ ప్రకటనపై మైక్రోసాఫ్ట్ కానీ, టిక్‌టాక్ కానీ ఇప్పటి వరకు స్పందించలేదు.