సొంత గూటికి రాములమ్మ?

0
81

లేడీ అమితాబ్ త్వరలో బీజేపీలో చేరనున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. సెప్టెంబర్ 15 లోపు విజయశాంతి కమలదళంలో చేరుతున్నట్టు సమాచారం. సరిగ్గా ఏడాది క్రితం మహారాష్ట్ర ఎన్నికల సమయంలో కూడా విజయశాంతి కాంగ్రెస్ ని వీడి బీజేపీలో చేరుతుందన్న వార్తలు వచ్చాయి. కాని అలా జరగలేదు. కానీ ఈ సారి అలా అనిపించటంలేదు.

విజయశాంతి పార్టీలోకి తిరిగి వస్తే రెండు తెలుగు రాష్ట్రాలలో క్యాడర్ కి మంచి జోష్ వస్తుందని ఆ పార్టీ పెద్దలు బావిస్తున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి రెండు తెలుగు రాష్ట్రాలలో బీజేపీ జెండా ఎగరేయాలని కమళదళం ఆశిస్తోంది. నాయకులు, మంచి క్యాడర్ ఉన్నా ప్రజల్లో గ్లామర్ ఉన్న నేతలు లేరు. విజయశాంతి ఆ స్థానాన్ని భర్తీ చేయగలదని ఆ పార్టీ పెద్దలు బావించి ఉండవచ్చు. పైగా బీజేపీ ఆమెకు కొత్తేమీ కాదు. ఆమె రాజకీయ జీవితమే బీజేపీతో ప్రారంభమైంది. ఆ పార్టీ మహిళా విభాగం..భారతీయ మహిళా మోర్చ కార్యదర్శిగా పనిచేసిన అనుభవం ఉంది. పైగా ఇప్పుడు ఆ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది.

ఏ లెక్కన చూసిని బీజేపీలోకి ఆమె రీ ఎంట్రీనీ కొట్టి పారేయలేం.ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొనక ముందు ఆమె బీజేపీలో ఉన్నారు. అయితే తెలంగణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని తల్లి తెలంగాణ పేరుతో సొంత పార్టీ పెట్టుకున్నారు. తరువాత పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేసారు. ఆ పార్టీ తరపున మెదక్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఐతే గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరి రాష్ట్ర మంతా తిరిగి ప్రచారం చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమితో ప్రస్తుతం ఆమె పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అదే సమయంలో ఆమె సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. పదమూడేళ్ల గ్యాప్ తరువాత మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రంలో కీలక పాత్ర పోషించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here