ఏడాదికి 12 పంటలు ఎలా పండించవచ్చో రైతులకు నేర్పుతున్న 60 ఏళ్ల విజయ్ జర్దారీ

133
799

నకు తెలిసినంత వరకు ప్రతి రైతు ఏడాదికి రెండు లేదా మూడు పంటలు పండిస్తాడు కానీ ఏడాదికి 12 పంటలు పండించటం నమ్మక శక్యమా..కాని పండివచొచ్చంటున్నారు ఉత్త రాఖండ్‌‌‌‌కు చెందిన 60 ఏళ్ల విజయ్ జర్దారీ. ఆయన ఈ వయస్సులో దీనిపై దేశంలోని రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.‘బీజ్‌‌‌‌ బచావో ఆందోళన్‌‌‌‌’ పేరుతో రైతులకు దాని గురించి చెప్తున్నారు.

తక్కువ ఖర్చుతో 12 పంటలు వేయొచ్చని, ఆ పంటలు వేయడం వల్ల కరువు, వరద పరిస్థితులను తట్టుకోవచ్చంటారు విజయ్ జర్ధారి.‘బారానాజ్‌‌‌‌’ (12 పంటలు పం డించడం) పేరుతో పంటలను పండిస్తున్నారీయన. దేశంలో మిల్లెట్స్‌‌‌‌ లాంటి పోషక పంటల సాగును, క్యాష్‌‌‌‌ క్రాప్స్‌‌‌‌ భర్తీ చేశాయని, దాని వల్ల రైతులు నష్టాల్లో కూరుకుపోయి ఇబ్బం దులు పడుతున్నారని అంటున్నారు ‘బీజ్‌‌‌‌ బచావో ఆందోళన్‌‌‌‌ (సేవ్‌‌‌‌ సీడ్స్‌‌‌‌)’ క్యాంపైన్‌‌‌‌ నడిపించే విజయ్‌‌‌‌ జర్దారీ. రైతులు కేవలం ఒక్కటి లేదా రెండు పంటలు మాత్రమే వేసి నష్టాలు తెచ్చుకుంటున్నారని, దీన్ని మార్చేందుకు ఈ ప్రచార కార్యక్రమం ప్రారంభించానని చెప్పారాయన.

చాలా తక్కువ ఖర్చుతో ఏడాదికి 12 పంటలు పండించవచ్చని, దాని వల్ల రైతులకు నష్టం కలగదనిఅంటున్నారు. దాని కోసం రీసెర్చ్‌‌‌‌ చేసి దాదాపు 350 రకాల విత్తనాలను సేకరిం చారాయన. ‘‘బారనాజ్‌‌‌‌ ’ ఎక్కువ పంటలు పండించే ఇంటర్నల్‌‌‌‌ క్రాపింగ్‌‌‌‌ మెథడ్‌‌‌‌. సాధారణంగా వర్షాలు ఎక్కువగా పడే ఉత్తరాఖండ్‌‌‌‌లోని తెహ్రీ, గర్హ్వాల్‌‌‌‌ ప్రాంతాల్లో ఎక్కువగా దీన్ని ఉప యోగిస్తారు. ఇది రైతులకు మంచి చేస్తుంది. ఒకే భూమిలో చాలా తక్కువ ఖర్చుతో కూరగాయలు, చిరు ధాన్యాలు, తృణధాన్యాలు, క్రీపర్స్‌‌‌‌ను పెంచుకోవచ్చు. దీనివల్ల ఒక పంట మరో పంట సాగుకు ఉపయోగపడుతుంది. అంతే కాకుండా రైతులకు నష్టాలు కూడా రావు. వీటిలోని కొన్ని పంటలు కరువును, వరదలను తట్టుకుంటాయి. దీంతో రైతుకు పంట నష్టం ఉండదు. ఈ పంటలు సాగుచేసేందుకు బయో ఫెర్టిలైజర్స్‌‌‌‌ ఉంటే చాలు”అన్నారు విజయ్‌ జర్ధారీ.

వ్యవసాయ ఆధారిత కుటుంబానికి చెందిన విజయ్‌‌‌ రైతుల కష్టాలు చూసి దీన్ని ప్రారంభించారు. ‘‘నా చిన్నప్పుడు మిల్లెట్స్‌‌‌‌ లాంటివి పండించేవాళ్లు. ఒకేసారి ఎక్కువ పంటలు వేసేవాళ్లు. ఆ తర్వాత రైతులంతా క్యాష్ క్రాప్స్‌‌‌‌ వైపు వెళ్లడంతో కెమికల్‌‌‌‌ ఫర్టిలైజర్స్‌‌‌‌ వాడటం ఎక్కువైంది. దాని వల్ల పొల్యూషన్‌‌‌‌ పెరిగి భూమి సారాన్ని కోల్పోతుంది. ఈ పరిస్థితి చూసినప్పుడే ఈ ఆలోచన వచ్చింది.12 పంటలు పండించడం వల్ల భూమి సారవంతంగా తయారవుతుంది. సాధు జంతువులకు ఫుడ్‌‌‌‌ విషయంలో కూడా ఇబ్బంది ఉండదు” అని అన్నారు విజయ్‌‌‌‌. ఉత్తరాఖండ్‌‌‌‌లోని దాదాపు 15 – 20 గ్రామాల్లో ఈ పద్ధతిలో పంటలు పండిస్తున్నారు.

133 COMMENTS

  1. Have you ever heard of second life (sl for short). It is essentially a online game where you can do anything you want. sl is literally my second life (pun intended lol). If you want to see more you can see these sl articles and blogs

  2. It?¦s really a great and helpful piece of information. I am glad that you just shared this useful info with us. Please stay us informed like this. Thank you for sharing.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here