మహేష్ అక్కగా విద్యా బాలన్!

0
121

రశురం దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ చిత్రంలో కీలక పాత్ర పోషించ డానికి బాలీవుడ్ నటి విద్యాబాలన్ ను సంప్రదించినట్లు సమాచారం. కీర్తి సురేష్ ఇందులో హీరోయిన్. ఈ మూవీ మేకర్స్ ఇటీవల విద్యాబాలన్ కలిసి కాన్సెప్ట్ వివరించారు. కథతో పాటు తన పాత్ర కూడా ఆ మెకు బాగా నచ్చినట్టు సమాచారం. నటిస్తానని మాట ఇచ్చిందట. బహుశా ఈ చిత్రంలో విద్యా బాలన్ మహేష్ కు అక్కగా నటించనుందన్న వార్త టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

మహేష్ బాబు పాన్ ఇండియా మార్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారన్న వార్తలు ఇటీవల జోరందు కున్నా యి. అందుకే సర్కారు వారి పాట ను బాలీవుడ్ కు తీసుకువెళుతున్నారన్న మాట కూడా వినిపిస్తోంది. అందుకే ఈ చిత్రంలో పలువురు బాలీవుడ్ తారలను నటింపచేస్తున్నారన్నది టాక్. ఒకప్పటి బాలీవుడ్ సూపర్ స్టార్ అనిల్ కపూర్ ఇందులో విలన్ గా నటిస్తున్నారని కూడా అంటున్నారు. ఆయన ఓకే చెప్పారని కూడా టాక్. ఒకప్పుటి ఈ సూపర్ స్టార్ ఇటీవల విలన్ వేషాలు కూడా వేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సర్కారు వారి పాట బాలీవుడ్ హక్కులను 14 కోట్లకి నిర్మాతలు విక్రయించినట్లుగా సోషల్ మీడియా టాక్.

కరోనా కారణంగా పట్టాలెక్కని సర్కారు వారి పాట త్వరలోనే అమెరికాలో మొదటి షెడ్యూల్ మొదలు కాబోతుంది అని..ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా మొదటిసారి మహేష్ కి జోడిగా నటించ బో తుంది. ఇక సర్కారు వారి పాట యూనిట్ మొత్తం ఇప్పుడు షూటింగ్ ఎలా మొదలు పెట్టాలో నే ప్లాన్ చేసి దాన్ని ఎలా ఆచరణలో పెట్టాలనే దాని మీద చర్చిస్తున్నారని సమాచారం.

విద్యా బాలన్ తెలుగులో నటించటం ఇదే మొదలు కాదు. 2019లో వచ్చిన ఎన్‌టిఆర్‌లో బసవ తారకం పాత్రలో నందమూరి బాలకృష్ణ సరసన నటించింది. ఇక ఇటీవల విద్యాబాలన్ నటించిన రెండు చిత్రాలె మిషన్ మంగల్ , శకుంతల దేవి మంచి విజయాలు సాధించాయి. అందుకే ‘సర్కారు వారీ పాటా’ చిత్రం కోసం ఆమెను సంప్రదించినట్టు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here