భార్యను చితక బాదుతూ కెమెరాకి చిక్కిన పోలీస్ అధికారి ..వీడియో వైరల్

0
114

ధ్యప్రదేశ్ లో ఓ సీనియర్ పోలీస్ అధికారి భార్యను చితక బాదుతున్న వీడియో వైరల్ గా మారింది. సెప్టెంబర్ 27 నాటి ఈ వీడియోలో మధ్యప్రదేశ్ పోలీస్ అదనపు డైరెక్టర్ జనరల్ (ఎడిజి) పురుషోత్తమ్ శర్మ భోపాల్ లోని తమ ఇంటి వద్ద భార్యను లాగి కొడితే ఆమె నేల మీద పడిపోయినట్టు ఈ వీడియోలో చూడవచ్చు. ఆమె తన మీద ఆధారపడి బతుకు తోందని, ఆమెకు అయ్యే ఖర్చంతా తనదేనని ఈ ప్రబుద్ధుడు తాను చేసిన నిర్వాకాన్ని సమర్థించుకున్నాడు.

అతను భార్యపై దాడి చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు ఆయనను ఆపుతున్నట్టు కూడా వీడియోలో చూడవచ్చు. పురుషోత్తం తన భార్యపై దాడి చేస్తుండగా అక్కడ ఓ కుక్క అరుపులు వీడియోలో వినిపించటం చూడొచ్చు. ఇంతలో అక్కడ ఉన్న ఇద్దరు వ్యక్తులలో ఒకరు పురుఫోత్తాన్ని పైకి లేపి భార్యకు దూరంగా లాక్కెల్లాడు. వీడియోలో, చివరికి, “ఇది నా ఆస్తి అనటం వినిపిస్తుంది. ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సిడబ్ల్యు) శర్మను తగిన విధంగా శిక్షించాలని ముఖ్యమంత్రి శివరాజ్ షింగ్ చౌహన్‌కు లేఖ రాసింది. ఇటువంటి సంఘటనలు సమాజానికి తప్పుడు సందేశాన్ని పంపుతాయని ఆ లేఖలో పేర్కొన్నారు.

ఇదిలావుంటే, మధ్యప్రదేశ్ ప్రభుత్వం శర్మను బదిలీ చేసినట్టు తెలుస్తోంది. పురుషోత్తం దీనిపై స్పందిస్తూ ఇది కుటుంబ వివాదం మాత్రమే నేరం కాదు అని తన చర్యను సమర్దించుకున్నాడు. “మాకు వివాహం జరిగి 32 సంవత్సరాలు, 2008 లో ఆమె నాపై ఫిర్యాదు చేసింది. విషయం ఏమిటంటే, 2008 నుండి, ఆమె నా ఇంట్లో నివసిస్తోంది, అన్ని సౌకర్యాలను ఆస్వాదిస్తోంది, నా ఖర్చులతో విదేశాలకు వెళుతుంది, ”అని అతను చెప్పాడు. “నేను హింసాత్మక వ్యక్తిని, నేరస్థుడిని కాదు.” తన భార్య ఇంట్లో కెమెరాలు ఏర్పాటు చేసిందని ఆయన ఆరోపించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here