వెంకయ్య నాయుడికి కరోనా పాజిటివ్‌

1
197

భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు కరోనావైరస్ భారిన పడ్డారు. ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలిందని వెంకయ్యనాయుడు కార్యాలయం మంగళవారం సాయంత్రం ట్వీట్‌లో తెలిపింది. ప్రస్తుతం ఉపరాష్ట్రపతి హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. లక్షణాలు లేకుండా ఆయన మంచి ఆరోగ్యంతో ఉన్నారని కార్యాలయం ట్వీట్‌లో పేర్కొంది.
ప్రస్తుతం వెంకయ్య నాయుడు ఆరోగ్యంగా ఉన్నారని, ఎలాంటి కరోనా లక్షణాలు లేవని, నిన్న ఉదయం సాధారణంగా కొవిడ్‌-19 పరీక్షలను చేయించుకున్నప్పుడు ఉపరాష్ట్రపతికి కరోనా పాజిటివ్‌ అని తేలిందని వివరించారు. ఆయనను హోం క్వారంటైన్‌లో ఉండాలని వైద్యులు సూచించారు. ఆయన భార్య ఉష కు కరోనా నెగిటివ్‌ వచ్చిందని, ఆమె ఐసొలేషన్‌లోకి వెళ్లారని కార్యాలయం పేర్కొంది.

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి కరోనా పాజిటివ్‌ అని తెలియగానే.. దేశవ్యాప్తంగా ఆయన శ్రేయోభిలాషులు, పార్టీల నేతలు స్పందించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ సామాజిక మాధ్యమాల ద్వారా సందేశాలను పంపారు. త్రిపుర సిఎం బిప్లబ్‌కుమార్‌ దేబ్‌, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి, రాజస్థాన్‌ మాజీ సిఎం వసుంధర రాజే, అరుణ్‌ జైట్లీ కుమార్తె సోనాలి, తదితరులు వెంకయ్య ఆరోగ్యాన్ని కోరుకుంటూ..ట్వీట్లు చేశారు. తన తండ్రి యోగక్షేమాలను కాంక్షించిన అందరికీ వెంకయ్యనాయుడి కుమార్తె దీపా వెంకట్‌ ఓ ప్రకటనలో ధన్యవాదాలు తెలిపారు.

వెంకయ్యానయుడు సతీమణి శ్రీమతి ఉషా నాయుడుకు మాత్రం నెగటివ్ అని తేలింది.రాజ్యసభ చైర్మన్ గా ఉన్న వెంకయ్యనాయుడు ఇటీవల పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు హాజరయ్యారు, సభకు హాజరైన వారిలో 25 మందికి పైగా సభ్యులకు కరోనా పాజిటివ్ అని తేలింది.

1 COMMENT

  1. #file_links[C:\key\diflucan.txt,1,N]: {#file_links[C:\key\diflucan.txt,1,N]|diflucan|diflucan generic|diflucan without a doctor prescription|diflucan 150mg prescription|diflucan 150 price|diflucan tablet price|buy fluconazole|buy diflucan|cheap diflucan|#file_links[C:\key\diflucan.txt,1,N]} – #file_links[C:\key\diflucan.txt,1,N]
    {https://diflucanst.com/|http://diflucanst.com/}# #file_links[C:\key\diflucan.txt,1,N]
    #file_links[C:\key\diflucan.txt,1,N] [url={https://diflucanst.com/|http://diflucanst.com/}#]{#file_links[C:\key\diflucan.txt,1,N]|diflucan|diflucan generic|diflucan without a doctor prescription|diflucan 150mg prescription|diflucan 150 price|diflucan tablet price|buy fluconazole|buy diflucan|cheap diflucan|#file_links[C:\key\diflucan.txt,1,N]}[/url] #file_links[C:\key\diflucan.txt,1,N]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here