కరోనా మహమ్మారి సీనియర్ సిటిజన్ల సాలిట శాపంగా మారింది. బాలీవుడ్ నటుడు దిలీప్‌కుమార్ మరో సోదరుడు ఇషాన్‌ఖాన్(90) కన్నుమూశారు. ముంబయి లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇషాన్ మృతి చెందాడు. గత కొంతకాలంగా గుండె జబ్బుతో బాధపడుతున్న ఇషాన్‌ఖాన్ కు గత నెల 16న కరోనా వైరస్ సోకింది. దీంతో ఆయన చికిత్స కోసం లీలావతి ఆస్పత్రిలో చేరారు. ఆయనకు వైద్యులు వెంటిలేట ర్ పై చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో గురువారం తెల్లవారుజూమున ఇషాన్ ఖాన్ మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఇటీవల దిలీప్ కుమార్ మరో సోదరుడు అస్లాంఖాన్ కూడా కరోనా బారినపడి ఆగస్టులో మృతి చెందారు. కాగా, ఇషాన్‌ఖాన్ మృతికి పలువురు బాలీవుడు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. వాస్దవానికి దిలీస్ కుమార్ ఇద్దరు సోదరులు అనారోగ్యంతోఆగస్టు 15న ఆస్పత్రిలో చేరారు. తరువాత వారికి కరోనా సోకినట్టు నిర్థారణ అయింది. ఈ నేపథ్యంలో 97 ఏళ్ల దిలీప్ కుమార్, ఆయన భార్య సైరా బాను అప్పటి నుంచి పూర్తిగా ఐసోలేషన్ లో ఉన్నారు. తనకు ఎలాంటి ఇన్ ఫెక్షన్ సోకకుండా భార్య సైరా అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందని దిలీప్ ట్వీట్ చేశారు.