మిస్టర్ అండ్ మిసెస్ ట్రంప్ @ కరోనా పాజిటివ్

0
119

ఎంతవారలైనా కరోనాకు దాసోహం అనాల్సిందే. ప్రపంచాన్ని వణిస్తున్న మహమ్మారి కరోనా వైరస్ నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తప్పించుకోలేకపోయారు. తాజాగా ఆయనకు కోవిడ్-19 నిర్ధారణ అయింది.ట్రంప్ భార్య, అమెరికా ప్రథమ మహిళ మెలానియాకు కూడా కరోనా సోకింది. దీంతో ఈ మేరకు ట్రంప్ శుక్రవారం ట్వీట్ చేశారు. తాము క్వారంటైన్ ప్రక్రియను ప్రారంభించి తగిన చికిత్స తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.కాగా ట్రంప్ ఉన్నత సలహాదారుగా పనిచేస్తున్న హోప్ హిక్స్ కు కరోనా పాజిటివ్ తాజాగా నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలోనే తాను కూడా కరోనా నిర్ధారిత పరీక్షలుచేయించుకోనున్నట్టు ట్రంప్ వెల్లడించిన సంగతి తెలిసిందే. అధ్యక్ష ఎన్నికల డిబేట్ మొదలై ప్రచారం మంచి వేడెక్కిన తరుణంలో ట్రంప్ కరోనాబారిన పడటం ..క్వారంటైన్ కావటం ఆయనకు కాస్త ఇబ్బందే.

https://twitter.com/realDonaldTrump/status/1311892190680014849

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here