టీవీ9 కు రజనీకాంత్ రాజీనామా…!వైరలా ..రియలా?

0
167

టీవీ9 సీనియర్ జర్నలిస్ట్ రజినీకాంత్ బాధ్యతల నుంచి వైదొలిగారన్న వార్త మీడియా సర్కిల్స్ లో కోడై కూ స్తోంది. మేనేజ్మెంట్ ఆయనను తప్పించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తెుతం ఆయన ప్రైమ్ టైమ్ లో బిగ్ డిబేట్ చర్చాకార్యక్రమం నిర్వహిస్తున్నారు. రజనీ రాజీనామా చేసినట్టు కొన్ని వెబ్ సైట్లు వార్తలు ప్రచురించాయి.

తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాలో తనకంటూ ప్ర్యత్యేక స్థానం ఏర్పరుచుకుని ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన టీవీ9 మేనేజ్మెంట్ కొంతకాలం క్రితం చేతులు మారింది. అప్పటి నుంచి చానెల్ లో మార్పులు చేర్పులు జరుగు తున్నట్టు సమాచారం. ఇప్పటికే టీవీ9 నుంచి పలువురు ఉద్యోగులను బయటకు పంపించారని తెలు స్తోంది. ఈ క్రమంలోనే రజనీకాంత్ రాజీనామా చేశారనే వార్తలు షికారు చేస్తున్నాయి. అయితే బుధ వారం రాత్రి పది గంటల వరకు ఆయన టీవీ9 కార్యాలయంలోనే ఉన్నట్టు ఆ చానెల్ వర్గాలు అంటున్నా యి. దీంతో రజనీ రాజీనామా వార్తల్లో నిజం ఉన్నట్టు అనిపించట్లేదు. ప్రస్తుతం రజనీకాంత్ లాంటి వాక్ చాతుర్యం కలిగిన జర్నలిస్టులు తెలుగు టీవీ మీడియాలో చాలా తక్కువ. మేనేజ్మెంట్ ఆయనను తొలగించారనటం నమ్మదగినదిగా లేదు.

టీవీ9 ను మైహోం గ్రూప్ టేకోవర్ చేసినప్పటి నుంచి వివాదాలు మరింతగా ముసురుకున్నాయి. ఛానల్ సీఈవో, వాటాదారుల్లో ఒకరమైన రవిప్రకాశ్ తొలగింపు, కేసులఇష్యూ అప్పట్లో సంచలనం సృష్టించింది. ప్రస్తుతం కొత్త మేనేజ్మెంట్ ఉద్యోగుల మీద ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. రవిప్రకాశ్ తో సంబంధాలున్న వారిని ఒక్కొక్కరిని బయటకు సాగనంపుతున్నట్టు తెలుస్తోంది. మొత్తం రవిప్రకాశ్ టీంను కొత్త మేనేజ్ మెంట్ టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ వార్తలన్నీ ఉత్తి పుకార్లేనని, చానెల్ ఇమేజ్ ని దెబ్బతీయటానికి కొందరు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారని టీవీ నైన్ వర్గాలు అంటున్నాయి.

అయితే రజినీకాంత్ ప్లేస్ లోకి ఎవరిని తీసుకువస్తారన్న దానిపై ఇప్పుడు మీడియా వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. టీవీ9 లోనే ఉన్న మురళీక్రిష్ణకు ఆ బాధ్యతలు అప్ప జెప్పవచ్చన్న ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఆయన కూడా టీవీ9 ప్రారంభంనుంచి అందులో ఉన్నారు. ఆయన కూడా రవిప్రకాష్ సానబెట్టిన వజ్రమే. కాబట్టి మురళీక్రిష్ణకు ఆ బాధ్యతలు అప్పజెప్పే అవకాశాలు తక్కువే అనుకోవాలి. ఒకవేళ రజనీ రాజీనా నిజమైతే, బహుశా కొత్త ముఖం తెరమీదకు రావచ్చు. వి6 సీఈ వోతో పాటు పలువురి పేర్లు వినిపిస్తున్నట్టు మీడియా గ్రూపుల్లో వినిపిస్తున్న మాట..

ఇదిలావుంటే, ఇటీవల టీవీ 9కు సంబంధించిన ఓ వివాదం కంపెనీ ట్రిబ్యునల్ వరకు వెళ్లింది. మైహోం గ్రూప్.. టీవీ 9ను పూర్తిగా నష్టాల్లోకి నెట్టేసిందని కంపెనీ లా ట్రిబ్యునల్ కు ఫిర్యాదు చేశారు మాజీ సీఈవో రవిప్రకాశ్. కంపెనీ టేకోవర్ చేసేందుకు తనకు అవకాశం ఇవ్వాలని… ప్రస్తుత మేనేజ్ మెంట్ కు ఆదేశా లివ్వాలని కోరారు.రవిప్రకాశ్ ఫిర్యాదు ఫలితమే ఈ పరిణామాలా అన్న అనుమానాలు కూడా వ్యక్తమ వుతున్నాయి. రవిప్రకాశ్ తో సన్నిహిత సంబంధాలున్నాయని విమర్శలున్న వ్యక్తులందరిని బయటకు పంపించేందుకు పర్ ఫెక్ట్ ప్లాన్ రెడీ చేసినట్టు తెలుస్తోంది.

ఏదేమైనా రజినీకాంత్ టీవీ9 నుంచి వెళ్లిపోయారని చెప్పటం తొందరపాటే అవుతుంది. దీనిపై టీవీ9 నిర్వాహకులు ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.అప్పటి వరకు రజనీకాంత్ రాజీనామా వార్త వైరల్ మాత్రమే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here