టీవీ9 వార్తా ఛానెల్ మాజీ సీఈవో రవి ప్రకాష్ పుట్టిన రోజు ఇవాళ. వాస్తవానికి ఆయన జన్మదిన ఈ రోజని ఓ మీడియా మిత్రుడు ఫోన్ చేసి చెబితే తెలిసింది. అభ్యుదయ భావాలు కలిగిన రవి ప్రకాష్ లాంటి వారు సాధారణంగా పుట్టిన రోజులు జరుపుకోవ టానికి దూరంగా ఉంటారు. తెలుగు మీడియా రంగంలో రవి ప్రకాష్ ది ప్రత్యేక ముద్ర. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా. ఈ రంగంలో అడుగు పెట్టినప్పటి నుంచీ ఆయన తనదైన ముద్ర కోసం ప్రయత్నించారు. తేజ టీవీలో రవిప్రకాష్ షో ఎన్ కౌంటర్ అప్పట్లో ఓ సంచలనం. విద్యుత్ ఆందోళనప్పుడు బషీర్ బాగ్ కాల్పుల ఘటనలపై ఆయన రిపోర్టింగ్ తెలుగు మీడియాలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. రవి ప్రకాష్ ఇంటర్వ్యూ చేసే విధానం .. అగ్రెసివ్ రిపోర్టింగ్ ని ఇప్పటికీ చాలా మంది అనుకరిస్తుంటారు. అనుకరణ అనకుండా ఆదర్శంగా తీసుకుంటారనటం సమంజపమేమో.
2004లో రవిప్రకాష్ సీఈవోగా ప్రారంభమైన టీవీ9 ఆయన నాయ కత్వంలో అంచెలంచెలుగా ఎదిగింది. తెలుగులో నెంబర్ వన్ వార్తా చానల్ గా నిలిచింది. మెరుగైన సమాజం కోసం తన వంతు ప్రయత్నం చేసింది. అయితే కొన్నాళ్ల క్రితం ఆయన టీవీ9కి దూరమయ్యారు. మళ్లీ ఆయన వార్తల తెరమీదకు ఎప్పుడు వస్తారో తెలియదు.
తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాలో దాదాపు అన్ని న్యూస్ ఛానెల్స్ ఆయన వేసిన బాటలోనే పయనిస్తున్నాయి. ఈ ట్రెండ్ ని మార్చాలంటే మళ్లీ రవిప్రకాశ్..రవి ప్రకాశ్ లాంటి ప్రొఫెషనల్ జర్నలిస్టులు రావాల్పిందేనేమో. త్వరలోనే ఆయన ప్రధాన మీడియా స్రవంతిలో తిరిగి అడుగుపెడతారని ఈ సందర్భంగా ఆశిద్దాం…!!