బాలీవుడ్ లో మరో ఘోరం..టీవీ నటుడు సూసైడ్

29
748

సుశాంత్ ఘన మరవక ముందే బాలీవుడ్‌లో మరో ఘోరం జరిగింది. టివి నటుడు అక్షత్‌ ఉత్కర్ష్‌ (26) ఆత్మహత్య చేసుకున్నాడు. బీహార్‌కు చెందిన ఈ నటుడు ముంబైలోని తన అద్దె ఫ్లాట్‌లో సూసైడ్ చేసుకున్నాడు. లాక్‌డౌన్‌ కారణంగా కొంత కాలంగా షూటింగ్‌లు ఆగిపోవడంతో ఉత్కర్ష్‌ తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై ఆత్మహత్య చేసుకున్నట్లు అంబోలీ పోలీసులు ప్రాథమిక నిర్ధారణలో తేల్చారు.

ఇదిలా ఉండగా ఉత్కర్ష్‌ మానసిక ఒత్తిడి వల్ల చనిపోలేదని, ఉత్కర్ష్‌ని హత్య చేసి చంపేశారని అతని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు పోలీసులు అప్పగించారు. ఉత్కర్ష్‌ తన ఫ్లాట్‌లో ఓ స్నేహితురాలితో కలిసి ఉంటున్నాడని, ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో ఉత్కర్ష్‌ చనిపోయినట్లు ఆమె గమనించి తమకు సమాచారం అందించిందని పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

29 COMMENTS

  1. Have you ever heard of second life (sl for short). It is basically a online game where you can do anything you want. Second life is literally my second life (pun intended lol). If you want to see more you can see these sl articles and blogs

  2. Hello! Do you know if they make any plugins to assist with SEO? I’m trying to get my blog to rank for some targeted keywords but I’m not seeing very good gains. If you know of any please share. Thanks!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here