ముంబైలోని తన కార్యాలయంలో నిర్మాణాలను కూల్చివేసిన విషయంపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే పై విరుచుకుపడ్డారు. ఇందులో ఆమె “తు” (ఏకవచనం)అని సంబోధించింది. “ఉద్ధవ్ ఠాక్రే, తుజే క్యా లగ్తా హై? అంటూ తన ట్విటర్ అకౌంట్ లో వీడియో షేర్ చేసింది. కశ్మీర్ పండిట్లు ఎంతటి క్షోభ అనుభవించారో తనకు ఇప్పడు తెలిసొచ్చిందని..వారిపై సినిమా తీస్తానని కంగన ప్రామిస్ చేశారు. ఇక ఉద్దవ్ నొ ప్రస్తావిస్తూ..ఉద్దవ్ ఠాక్రే నువ్వు ఏమనుకుంటున్నామ్.. కాల చక్రం తిరుగుతుంది..ఇవాళ నా ఇల్లు కూలింది..రేపు నీ అహం కూలిపోతుంది అంటూ కూల్చివేతపై వీడియోలో ఘాటుగా స్పందించారు కంగన.