ఆస్పత్రి లో ట్రంప్ ..వాట్ నెక్ట్ప్ ?

3899
94821

ధ్యక్ష ఎన్నికల ముందు అమెరికాలో ఒక విచిత్ర పరిస్థితి నెలకొంది. అమెరికా అధ్యక్షుడు ..అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కరోనా బారిన పడటమే ఆ పరిస్థితికి కారణం. ప్రస్తుతం ఆయన మిలటరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తాను బాగానే ఉన్నానని చెపుతున్నారు ట్రంప్. ఆయనపై కరోనా ప్రభావం తక్కువగా ఉంటే ఫర్వాలేదు. కానీ తీవ్రస్థాయిలో ఉంటే అమెరికా పరిపాలనా బాధ్యతలు ఎవరు మోస్తారు అనేది ఇప్పుడు చర్చగా ఉంది.

74 ఏళ్ల ట్రంప్‌ కరోనా కారణంగా తీవ్రంగా అస్వస్థతకు గురైతే మాత్రం పరిపాలనా బాధ్యతలను ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌కు అప్పజెప్పాల్సి ఉంటుంది. అమెరికా చట్టం ప్రకారం అధ్యక్షుడు.. బాధ్యతలు నిర్వర్తించలేని స్థితిలో ఉంటే ఉపాధ్యక్షుడికి ఆ అధికారాలు బదిలీ చేయవచ్చు. గతంలో అధ్యక్షులు రొనాల్డ్‌ రీగన్‌, జార్జి డబ్ల్యు బుష్‌ కూడా ఇలా చేశారు. అయితే అధ్యక్షుడు స్వయంగా అధికారాలు బదలాయించలేని స్థితిలో ఉంటే ఉపాధ్యక్షుడు గానీ, కేబినెట్‌ కాంగ్రెస్‌ కానీ ఉభయ సభల నేతలకు తెలియజేసి తాత్కాలిక ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇటువంటి సందర్భంలోనూ ఉపాధ్యక్షుడే తాత్కాలిక బాధ్యతలు నెరవేర్చుతాడు.

మరో నెలరోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ పరిస్థితుల్లో రిపబ్లికన్‌ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్ధి డొనాల్డ్‌ ట్రంప్‌ బరిలో ఉన్నారు. కోలుకోవటానికి ఎంత సమయం పడుతుందో ఇప్పుడే చెప్పలేము. . కరోనా ప్రభావం నుంచి కొలుకున్నా కనీసం 24 రోజులు ట్రంప్‌ క్వారంటైన్‌లోనే ఉండాలి. ఇప్పటికే రేస్ లో బిడెన్‌ కన్నా వెనకబడిన ట్రంప్‌కు ఈ పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారనుంది. దీంతో ఎన్నికల ప్రచారానికి పూర్తిగా దూరంగా కావాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికే ఈనెల 15వ తేదీన బిడెన్‌తో జరగాల్సిన ముఖాముఖి కార్యక్రమం వాయిదా పడింది.

ట్రంప్‌ టీమ్‌ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించినప్పటికీ ట్రంప్‌ లేకుండా చేసే ప్రచారం పెద్దగా ఫలితాన్ని ఇవ్వదు. కరోనాను నియంత్రించడంలో ట్రంప్‌ విఫలమయ్యారని ఇప్పటికే విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆయనకు కూడా కరోనా సోకడం ఈ విమర్శలను మరింత పెంచే అవకాశముంది. లేక బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ లాగా కరోనా బారిన పడినందుకు సానుభూతిని తెచ్చుకోవచ్చనే వార్తలు వినిపిస్తున్నప్పటికీ అమెరికాలో అలా జరిగే అవకాశం లేదని విశ్లేషకులు అంటున్నారు. మొత్తంగా మరో నెల రోజుల్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కరోనా సోకడం ట్రంప్‌ అవకాశాలపై ప్రభావం చూపించనుంది.

ట్రంప్‌ కరోనా బారిన పడడంతో అధ్యక్ష ఎన్నికలకు ముందర అభ్యర్థి మరణిస్తే పరిస్థితి ఏమిటనే ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతుంది. ‘వాషింగ్టన్‌ పోస్టు’ పత్రిక ఏమంటుందంటే…నవంబరు ఎన్నికలకు ముందు అధికారికంగా నామినేట్‌ అయిన అభ్యర్ధి ఎవరైనా మరణిస్తే అప్పుడు బంతి జాతీయ రాజకీయ పార్టీల కోర్టులోకి వెళ్తుంది. డెమొక్రటిక్‌ పార్టీలో అయితే 447 మంది సభ్యులు కలిగిన ఆ పార్టీ జాతీయ కమిటీ డిఎన్‌సి సమావేశమై మరణించిన అభ్యర్థి స్థానే కొత్త అభ్యర్ధిని ఎన్నుకునే అవకాశం ఉందని రాజ్యాంగ నిపుణుడు రిచర్డు పిల్డేస్‌ తెలిపారు. డెమొక్రటిక్‌ జాతీయ కమిటీ అధ్యక్షుడు అమెరికన్‌ కాంగ్రెస్‌ (పార్లమెంటు) లోని డెమోక్రటిక్‌ పార్టీ నాయకత్వాన్ని, ఆ పార్టీకి చెందిన గవర్నర్ల అసోసియేషన్‌ను సంప్ర దించిన మీదట డిఎన్‌సి సభ్యుల ముందు ఒక నివేదిక ఉంచుతారు. దాని ఆధారంగా నూతన అభ్యర్థి ఎంపిక ఉంటుంది. రిపబ్లికన్‌ పార్టీ కూడా ఇదే పద్ధతిని అనుసరిస్తుంది.

168 మంది సభ్యులతో కూడిన రిపబ్లికన్‌ జాతీయ కమిటీీ(ఆర్‌ఎన్‌సి) ఈ ఎంపిక ప్రక్రియ చేపడుతుంది. అమెరికాలోని ప్రతి రాష్ట్రం తరపున ముగ్గురు సభ్యులతో పాటు ఆరు కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ముగ్గురు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. అలస్కా మినహా మిగతా అన్ని రాష్ట్రాల ప్రతినిధులకు ఓట్లు సమానంగా ఉంటాయి. అలస్కాకు చెందిన ముగ్గురు సభ్యులకు మాత్రం 28 ఓట్లు వేసే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఆ ముగ్గురు సభ్యులు అంగీకరించకుంటే వారిలో ఒక్కొక్కరు మూడింట ఒక వంతు ఓట్లు వేసే అవకాశం ఉంటుంది. ఇది అంత తేలిక ఏమీ కాదు. బ్యాలెట్‌ కోసం పార్టీలు తమ అభ్యర్ధులను ధ్రువీకరించి నప్పుడు వేర్వేరు రాష్ట్రాలకు వేర్వేరు గడువులు ఉంటాయి. గడువు తేదీ తర్వాత అభ్యర్ధుల పేర్లు మార్చే చట్టం రాష్ట్రాలకు లేనప్పుడు కోర్టు వాటిని పరిష్కరించాల్సి ఉంటుంది. ఏదేమైనా ఈ సారి అమెరికా అధ్యక్ష ఎన్నికలు చిత్ర విచిత్రమైన మలుపులు తిరుగుతాయని మాత్రం దీనిని బట్టి అర్థమవుతోంది.

3899 COMMENTS


    Fatal error: Allowed memory size of 134217728 bytes exhausted (tried to allocate 7352320 bytes) in /home/n8rpctrj1kcp/public_html/wp-includes/comment-template.php on line 2230