అన్నీ నాకే …భారతీయ ఓటర్లపై ట్రంప్ ఆశలు..

0
67

మెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇంకో మూడు నెలలే ఉంది. దీంతో ప్రచార వేగం పెరిగింది. మరోదఫా ఎన్నికవ్వటానికి అధ్యక్షుడు ట్రంప్ తనకు గల అన్ని అవకాశాలను వినియోగించుకుంటున్నారు. అమెరికాలోని ప్రవాస భారతీయుల ఓటర్లను ఎలాగైనా తనవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకోసం ప్రధాని మోడీతో తన స్నేహాన్ని కూడా ఎన్నికల కోసం ఉపయోగించుకుంటున్నారు. నరేంద్ర మోదీ మద్దతు తనకే ఉంటుందని ప్రకటించారు. అమెరికాలో భారతీయుల ఓట్లన్నీ తనకే వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. వైట్ హౌస్ లో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఇండియన్‌ అమెరికన్‌ ఓట్ల గురించి అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇండియా సహకారం మాకు ఎంతగానో ఉంటోంది.. ప్రధాని మోదీ మాకు బలమైన మద్దతుదారు. ప్రవాస భారతీయుల ఓట్లన్నీ మాకే వస్తాయన్న విశ్వాసం ఉంది’అని అన్నారు ట్రంప్

తమ కుటుంబానికు భారతదేశం పట్ల ప్రేమాభిమానాలు ఉన్నాయని ట్రంప్‌ చెప్పారు. తన కుమార్తె ఇవాంకా ట్రంప్, కుమారుడు జూనియర్‌ డొనాల్డ్‌ ట్రంప్, అతని స్నేహితురాలు కింబర్లీలకు భారతీయుల్లో మంచి పేరు ఉందని ఉన్నారు. వారంతా భారత్‌ గురించి ఎక్కువగా ఆలోచిస్తారని, అందుకే తనకి కూడా ఆ దేశం అంటే ఎంతో అభిమానమని చెప్పుకొచ్చారు. భారతీయుల సెంటిమెంట్లు తనకెంతో నచ్చుతాయన్న ట్రంప్‌ ఇండియన్‌ అమెరికన్ల ఓట్ల కోసం వారు ముగ్గురూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని చెప్పారు.


ఇదిలావుంటే, ప్రత్యర్ధి డెమోక్రాట్లు కూడా ఇంండియన్ అమెరికన్ల మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారు. పలు రాష్ట్రాలలో ఈ ఓట్లే ఫలితాలను నిర్ధేశిస్తాయని విశ్లేషకులు సైతం అంగీకరిస్తున్నారు. ఏదేమైనా ఈ ఎన్నికల్లో ప్రవాస భారతీయ ఓటర్లే కీలకం కాబోతున్నారన్నది వాస్తవం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here