రాజ్యాంగ హక్కులకు విరుద్ధంగా వ్యవసాయ బిల్లులను రూపొందించారని టీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు విమర్శించారు. వ్యవసాయ బిల్లులపై లోక్ సభలో మాట్లాడిన ఆయన, నూతన వ్యవసాయ బిల్లులవల్ల రైతులకు అన్యాయం జరుగుతుందన్నారు.
ప్రజల అభిప్రాయాలు తీసుకోకుండా బిల్లులను ఏలా రూపకల్పన చేస్తారని ప్రశ్నించారు. కొత్త బిల్లులకు ఆమోదం లభిస్తే రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. రాష్ట్రాల హక్కులను హరించేలా కేంద్రం వ్యవహరిస్తోందని ఆరోపించారు.
కొత్తగా వచ్చే అగ్రికల్చర్ బిల్లుల వల్ల వ్యవసాయంపై ఆధారపడిన వేలాదిమంది నిరుద్యోగులుగా మారతారని అన్నారు. అగ్రికల్చర్ దేశాన్ని కార్పోరేటు దేశంగా మార్చాలని కేంద్రం చూస్తోందన్నారు.