రేపే ఆర్జీవీ ‘దిశా ఎన్‌కౌంటర్‌’ ట్రైలర్‌ రిలీజ్

0
184

ర్జీవీ కొత్త సినిమా దిశ ఎన్కౌంటర్ ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఖాయం చేశాడు. రేపు ఉదయం 9గంటల 08 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లు ఆర్జీవీ ప్రకటించారు. నట్టి కరుణ సమర్పణలో అనురాగ్‌ కంచర్ల ప్రొడక్షన్‌పై ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆనంద్‌ చంద్ర ఈ సినిమా దర్శకుడు. దిశా ఘటన జరిగిన రోజు నవంబర్‌ 26నే సినిమాను విడుదల చేస్తానని వర్మ ప్రకటించారు.

https://twitter.com/RGVzoomin/status/1309295136052969472

గత సంవత్సరం హైదరాబాద్ శివారు ప్రాంతంలో కొందరు యువకులు ఓ అమ్మాయిపై అత్యాచారం చేసి చంపేశారు. ఈ దుర్ఘటనతో దేశం యావత్తు షాకయ్యింది. దోషులను కఠినంగా శిక్షించాలని ఆందోళనలు కూడా జరిగాయి. చివరకు అమ్మాయిపై అఘాయిత్యం చేయడమే కాకుండా ఆమెను చంపేసిన దోషులను పోలీసులు కనిపెట్టి ఎన్‌కౌంటర్‌ చేశారు. ఘటనను ఆధారంగా చేసుకుని వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ, ‘దిశా ఎన్‌కౌంటర్‌’ అనే సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here