వకీల్ సాబ్ షూటింగ్ షురూ..

0
76

రోనా అన్ లాక్ 4 లో మొట్టమొదలు ఫిలిం సెట్స్ కు వెళ్లిన టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున. ‘వైల్డ్ డాగ్’ షూటింగ్ లో బీజీగా ఉన్నాడు నాగ్. ఇది యాక్షన్-అడ్వెంచర్ చిత్రం. దీంతో పాటు ‘గుడ్ లక్ సఖి’ ‘లవ్ స్టోరీ’ వంటి భారీ ప్రాజెక్టులు షూటింగ్ లు జరుపుకుంటున్నాయి. ఈ వరసలో ఇప్పుడు మరో భారీ ప్రాజెక్ట్ చేరింది. అది పవన్ కళ్యాణ్ ..వకీల్ సాబ్.

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రానికి సంబంధించి కోర్టు సీన్ షూటింగ్ జరిగినట్లు తెలిసింది. సోమవారం నైట్ షెడ్యూల్ తో షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో సహాయ నటులతో కొన్ని సీన్స్ తీస్తున్నారు.

అక్టోబర్ నుంచి పవన్ కళ్యాణ్ షూట్‌లో పాల్గొననున్నట్టు సమాచార వర్గాల ద్వారా తెలిసింది. పవన్ కల్యాణ్ కనిపించని సీన్స్ అన్నింటిని ఈ షెడ్యూల్ లో ఫినిష్ చేయాలని దర్శకుడు వేణు శ్రీరామ్ బావిస్తున్నారు. శ్రుతి హాసన్ పోర్షన్ ను కూడా చిత్రీకరించాల్సి వుంది. నవంబర్ నాటికి మొత్తం షూట్ పూర్తి అవుతుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు .మొదటి కాపీ డిసెంబర్ నాటికి వస్తుందని ఆశిస్తున్నారు.

తాస్సీ పన్ను నటించిన హిందీ చిత్రం పింక్ కు ఇది రీమేక్. తాప్సీ క్యారెక్టర్ ని తెలుగులో నివేదా థామస్ పోషించనుంది. కీర్తి కుల్హారీ, ఆండ్రియా పాత్రలను అంజలి, అనన్య నాగల్లా చేస్తున్నారు. ఇక పింక్ తమిళ రీమేక్ లో విద్యా బాలన్ పాత్రను తెలుగులో శ్రుతీ హసన్ పోషించనున్నట్టు విశ్వసనీయ సమాచారం.

బోనీ కపూర్, దిల్ రాజు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హిందీ వెర్షన్ లో అమితాబ్, తమిళం లో అజిత్ న్యాయవాది పాత్రల్లో తమ నట విశ్వరూపం ప్రదర్శించారు. మరి పవన్ కల్యాణ్ నటన ఆ రేంజ్ లో ఉంటుందా? వకీల్ సాబ్ గా ప్రేక్షకులను ఆకట్టుకుంటారో లేదో చూడాలి.

ఈ చిత్రం తరువాత పవన్ కల్యాన్ రెండు సినిమాలు సెట్స్ కి వెళ్లటానికి రెడీగా ఉన్నాయి. క్రిష్ జగర్లాముడి, హరీష్ శంకర్తో వాటిని డైరెక్ట్ చేయనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here