50వ ఏట అడుగు పెట్టిన విజయ్ తల్లి..ప్రత్యేక వీడియో

0
175

టాలీవుడ్ అర్జున్ రెడ్డి దేవరకొండ విజయ్ తన తల్లి 50 వ జన్మదిన వేడుకలు ఘనంగా సెలబ్రేట్ చేశాడు, ఆమెకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా విజయ్ ఆమె పుట్టిన రోజు వేడుకలను ప్రత్యేకంగా నిర్వహించాడు. ఈ సందర్భంగా ఆయన ఓ చిన్న వీడియో క్లిప్ ని ఇనస్టాలో షేర్ చేశాడు. అర్థ సెంచరీ పూర్తి అయినట్టు బ్యాటింగ్ ని సింబాలిక్ గా చూపించారు.

విజయ్ త ల్లి మాధవితో పాటు తండ్రి ఆనంద్ దేవరకొండ కూడా ఈ వీడియోలో కనిపిస్తారు. ఈ పుట్టిన రోజు వేడుకలు చాలా కొద్ది మందిని మాత్రమే ఆహానించారు. వచ్చిన వారిలో అందాల తార రష్మిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గీతగోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో కలిసి నటించిన ఈ జంట మధ్య మంచి స్నేహ సంబంధాలున్నాయి.విజయ్ ఇంట్లో జరిగిన ఈ కార్యక్ర మాని కి హీరోయిన్ రష్మిక హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ పార్టీలో రష్మిక చాలా ఉత్సాహంగా పాల్గొంది. విజయ్ ఫ్యామిలీతో కలిసి ఫొటోలు దిగింది. ఆ ఫొటోలు సోషల్ మీ డియాలో వైరల్ అయ్యాయి. అనంతరం విజయ్ తల్లితో కలిసి దిగిన ఫొటోను రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here