తాడిపత్రిలో ఘోర రోడ్డు ప్రమాదం

0
20

నంతపురం జిల్లాలోని తాడిపత్రి శివారు వద్ద మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తిరుచానూరు నుంచి తాడిపత్రికి వస్తున్న తుఫాన్ వాహనాన్ని గుర్తుతెలియని వాహనం వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన క్షతగాత్రులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో మృతి చెందినవారు తాడిపత్రి వాసులేనని తేలింది. కాగా ప్రమాదంలో మృతి చెందిన వారు హేమలత, సుబ్రమణ్యం, వెంకట రంగయ్యగా గుర్తించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here