ఇంట్లో పనిచేసేవాళ్లే ఎక్కువగా చేతి వాటం ప్రదర్శిస్తుంటారు. అలాంటి అనుభవమే నటి గాయత్రి సాయినాథ్ కి ఎదురైంది.
చెన్నైలోని అమె ఇంట్లో పదకొండు తులాల బంగారం చోరీకి గురైంది. ఇంట్లో పనిచే స్తున్న నర్సు ఈ పనికి పాల్పడింది. దాంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు.
స్థానిక రాయపేటలోని లయిడ్స్ రోడ్డు వీధిలో నటి గాయత్రి సాయినాథ్ తన తల్లితో కలిసి ఉంటోంది. వృద్ధురాలైన తన తల్లికి సపర్యలు చేయడానికి స్థానిక మైలాపూర్, కబాలితోటకు చెందిన శివకామి అనే నర్సును ఏర్పాటు చేసుకుంది. కాగా ఇటీవల నటి గాయత్రి సాయినాథ్ ఇంట్లో 111 గ్రాముల బంగారం చోరీకి గురైంది. దీంతో ఆమె రాయపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాలు పరిశీలించగా దొంగతనానికి గురైన బంగారాన్ని నటి గాయత్రి సాయినాథ్ ఇంట్లో పని చేస్తున్న నర్సు శివకామి దొంగి లించినట్లు తెలియవచ్చింది. దీంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో బంగారాన్ని శివకామి తాకట్టు పెట్టినట్టు తెలిసింది. దీంతో పోలీసులు ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకొని, గాయత్రి సాయినాథ్కు అందజేసినట్లు తెలిపారు. ఇంట్లో పని చేసే వాళ్లను అనుమానించటం తప్పే కాని అప్పడప్పుడు ఇలాంటివి జరుగుతుం టాయి. కాబట్టి వారిపై ఓ కన్నేసి ఉంచాలని ఇలాంటి ఘటనలు నేర్పుతుంటాయి.