లక్షకు దగ్గరలో రోజు వారీ కరోనా కేసులు

0
72

దేశంలో కరోనా వ్యాప్తి తారాస్థాయికి చేరుతున్నదనిపిస్తోంది. కేవలం నిన్న ఒక్క రో జే దేశ వ్యాప్తంగా 95,735 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదాయ్యాయి. 1,172 మర ణాలు సంభవించాయి. ఇప్పటి వరకు ఇదో రికార్డు. ఇక దేశంలోనే తీవ్ర స్థాయిలో కరోనా బారిన పడ్డ మహారాష్ట్రలో గడచిన 24 గంటల్లో దేశంలోనే అత్యధికంగా 23, 577 కేసులు నమోదయ్యాయి. 380 మరణాలతో రాష్ట్రంలో అత్యధిక మరణాలు నమోదయ్యాయి.

మహారాష్ట్ర తరువాత ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, తమి ళనాడు ఉన్నాయి. గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ లో 10,418, కర్ణాటక- 9,540, యుపి- 6,568, తమిళ నాడు- 5,584. కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా రికవరీ రేటు 77.7 శాతం, మరణాల రేటు 1.6 శాతంగా ఉంది. మహా రాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు తమ మరణాల రేటును ఒక శాతం కంటే తక్కువగా ఉంచాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గత వారం ఆదేశించింది.

ఇప్పటి వరకు వరకు పరీక్షించిన మొత్తం నమూనాల సంఖ్య 5,29,34,433. గత 24 గంటల్లో 11.29 లక్షలకు పైగా నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వ గణాంకాలు తెలిపాయి. అత్యధికంగా 11.72 లక్షల పరీక్షలు సెప్టెంబర్ 3 న జరిగాయి. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు బుధవారం 7.7 శాతం.. మొత్తం మీద అది 8.4 శాతంగా ఉంది.

ఢిల్లీలో బుధవారం 4,000 కి పైగా కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. కరోనా వ్యాపించిన తరువాత ఢిల్లీలో ఇన్ని కేసులు నమోదు కావటం ఇదే మొదలు. ప్రపం చ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం, దాదాపు నెల రోజుల నుంచి రోజు వారీ కేసులలో భారత్ ప్రపంచంలో అత్యధిక కరోనావైరస్ కేసులను నివేదిస్తోంది. అమెరికా, ఇండి యా తరువాత, బ్రెజిల్, రష్యా,పెరూలో అత్యధిక కేసులు ఉన్నాయి. యుఎస్‌లో 63.59 లక్షలకు పైగా కేసులు ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here