మామా మందేద్దాం రా..

1
135

రోనా వల్ల ఎవరి సంగతి ఏమో కానీ మందుబాబులు మాత్రం బాగా ఇబ్బందిపడ్డారు. వైన్స్ ఓపెన్ అయినా దోస్తులతో కలిసి మందుకొట్టే ఛాన్స్ లేకపోయింది. అయితే ఇప్పుడు బార్లకు తలుపు బార్లా తెరిచింది కేసీఆర్ సర్కార్. ఆరు నెలల సుదీర్ఘ విరామం తర్వాత రాష్ట్రంలోని బార్లు తెరుచుకోనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

బార్లతోపాటు.. క్లబ్బులు, టూరిజం బార్లను కూడా తెరుచుకోవచ్చు. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని అందులో పేర్కొన్నారు. అయితే.. బార్ల యజమానులు కొవిడ్‌-19 నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలో మద్యాన్ని సర్వ్‌ చేసే బార్లు 1,038 ఉన్నాయి. మరో రెండు బార్లు కొత్తగా రాబోతున్నాయి. మద్యాన్ని సర్వ్‌ చేయడానికి అనుమతి ఉన్న క్లబ్బులు, టూరిజం బార్ల సంఖ్య 32గా ఉంది.

బార్ నిర్వాహకులు కొన్ని నిబంధనలను కచ్చితంగా పాటించాల్సి వుంటుంది. వినియోగదారులకు ప్రవేశం వద్ద థర్మల్‌ స్ర్కీనింగ్‌ తప్పనిసరి..అలాగే లోపలికి వెళ్లే ముందు క్యూ పద్దతి పాటించాలి. ఉదయం, సాయంత్రం వేళల్లో కచ్చితంగా బార్లను, పరిసరాలను శానిటైజ్‌ చేయాలి, పార్కింగ్‌ ప్రదేశాల్లో జనాలు గుమికూడకుండా చూడాలి. హ్యాండ్‌ శానిటైజర్లను అందుబాటులో ఉంచాలి,బార్లలో పనిచేసే సిబ్బంది తప్పనిసరిగా మాస్కులు ధరించాలి, మ్యూజికల్‌ ఈవెంట్లు, నృత్యాలకు అనుమతి లేదు, సరైన వెంటిలేషన్‌ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

అయితే, వైన్‌షాపులకు అనుబంధంగా ఉన్న పర్మిట్‌ రూములకు మాత్రం ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు.
ఏదేమైనా మద్యపానం ఆరోగ్యానికి హానికరమని అంతా గుర్తుంచుకోవాలి. కోవిడ్ సమయంలో మద్యం సేవిస్తే ఇమ్యూనిటీని తగ్గిస్తుందన్న విషయాన్ని మరవకూడదు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here