రైతు సోదరులారా ఈ విషయం గుర్తుంచుకోండి. ట్రాన్స్ఫార్మర్స్ ఫ్యూజులు పోయినప్పుడు తమ పనులకు ఆటంకం కాకూడదనే ఆతృతతో తామే రిపేర్ చేస్తూ విద్యుత్ షాక్ కు గురి అవుతున్నారు. మన రాష్ట్రంలో ప్రతీ ఏటా సుమారుగా విద్యుత్ షాక్ వల్ల వెయ్యి మందికి పైగా వ్యవసాయదారులు చనిపోతున్నారు. దాంతో ఆ కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరమవుతున్నాయి. ఇది నిత్యం జరిగే పని. ఇలాంటివి ఆపడానికి మన తెలంగాణ విద్యుత్ శాఖ వారు రైతులకు టోల్ ఫ్రీ నంబర్ ఇచ్చారు. వరంగల్, నిజామాబాద్,కరీంనగర్, అదిలాబాద్ ఖమ్మం జిల్లాల రైతులకు 1800 425 0028 మరియు మెదక్,రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ రైతులకు 1800 425 3600 ను కేటాయించారు.
మనం చేయాల్సినదల్లా. ట్రాన్స్ఫార్మర్స్ కాలిపోయినా ,ఫీస్ పోయిన , కరెంట్ వైర్లు క్రిందికి ఉన్నా ..వెంటనే పై టోల్ ఫ్రీ నంబర్ లకు ఫోన్ చేసినచో విద్యుత్ కంట్రోల్ రూమ్ నుండి సంబంధిత అధికారులకు సమాచారం చేరవేస్తారు. డిపార్ట్మెంట్ వారు వచ్చి ఆపని వెంటనే ఉచితంగా పూర్తి చేస్తారు. రైతులందరు ఈ అవకాశాన్ని వినియోగించు కోవాలని , ఎవరు ట్రాన్స్ఫార్మర్స్ వద్దకు వెళ్లకూడదని విద్యుత్ శాఖ వారు హెచ్చరిస్తున్నారు. మీ సమస్యలు పరిష్కరించడములో ఏదైనా ఇబ్బందులు వస్తే భారతీయ కిసాన్ సంఘ్ తెలంగాణ విద్యుత్ ప్రముఖ్ రవి గారిని సంప్రదించగలరు. 9908295502