ఏ క్షణంలో అయినా రియా అరెస్ట్..

0
92

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో డ్రగ్స్ లింకులపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్ .సి .బి ) దర్యాప్తు కొనసాగుతోంది. దర్యాప్తులో భాగంగా సుశాంత్ మాజీ ప్రియురాలిగా బావిస్తున్న నటి రియా చక్రవర్తిని నార్కోటిక్స్ అధికారులు విచారిస్తున్నారు. విచారణకు రావలసిందిగా ఈ ఉదయం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వారు ఆమె అపార్ట్ మెంట్ కు వెళ్లి సమన్లు అందచేశారు. దీంతో ఆమె ముంబైలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కార్యాలయానికి వెళ్లారు. ఆమె ఆఫీసు వెలుపల ఉండగా మీడియా కంట పడింది. ఆ సమయంలో రియా , గులాబీ రంగు కుర్తా, యాంకిల్ లెంథ్ జెగ్గింగ్స్ ధరించి ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తిని నార్కోటిక్స్ బ్యూరో అరెస్టు చేసింది. ఆమెను కూడా అరెస్టు చేయవచ్చని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో రియాకు తాజా సమన్లు రావటం ప్రాధాన్యత సంతరించుకుంది. తాజా పరిణామాలపై రియా చక్రవర్తి తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తి స్పందించారు. తన కొడుకును అరెస్టు చేశారని, ఇక ఇప్పుడు కూతురు వంతని రియా ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
తాజా పరిణామాలను బట్టి చూప్తే రియాను ప్రశ్నించిన తరువాత అటు నుంచి అటే అదుపులోకి తీసుకునే అవకాశాలను కూడా కొట్టిపారేయలేము. ఏ క్షణమైనా రియా అరెస్టయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే రియా అరెస్టుకు సిద్ధంగా ఉన్నారని ఆమె న్యాయవాది సతీశ్‌ మనేషిండే అన్నారు. ‘ది ఒక విచ్ హంట్ కాబట్టి రియా చక్రవర్తి అరెస్టుకు సిద్ధంగా ఉన్నారు. ఒకరిని ప్రేమించడం నేరం అయితే, దాని పరిణామాలను ఆమె ఎదుర్కొంటుంది. నిర్దోషి అయినందునే సిబిఐ, ఇడి, ఎన్‌సిబిలతో బీహార్ పోలీసులు పెట్టిన ఏ కేసులోనూ ముందస్తు బెయిల్ కోసం ఆమె ఏ కోర్టుకూ వెళ్లలేదు ” అని మనేషిందే ఒక ప్రకటనలో తెలిపారు. రియానే తనను డ్రగ్స్‌ తీసుకురమ్మన్నట్లుగా ఆమె సోదరుడు చెప్పడంతో రియా చుట్టూ ఉచ్చు మరింతగా బిగుసుకుంది. ప్రస్తుతం ఎన్‌సీబీ అధికారులు సమీర్‌ వాంఖడే, కేపీఎస్‌ మల్హోత్రా ఆధ్వర్యంలో రియా విచారణ కొనసాగుతోంది. కేసు దర్యాప్తు పేర్తయితే గానీ డ్రగ్స్ కనెక్షన్ అసలు కథ బయటకు రాదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here