డ్రగ్స్ ఆరోపణలపై నటి రియా చక్రవర్తి సోదరుడు షోవిక్ అరెస్టయ్యాడు.అతనితో పాటు సుశాంత్ ఇంటి మేనేజర్ శామ్యూల్ మిరిండాను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్ సి బి) ఇవాళ అదుపులోకి తీసుకున్నారు. జూన్ లో చనిపోయిన బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో డ్రగ్స్ కోణం వెలుగు చూసిన నేపథ్యంలో ఎన్ సి బి దర్యాప్తు చేపట్టింది. అరెస్టయిన ఇద్దరి ఇళ్లలో ఈ ఉదయం నార్కోటిక్స్ బ్యూరో తనిఖీలు నిర్వహించి విచారించారు. రియా చక్రవర్తి ,ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఈ కేసులో అదనపు ఆధారాలను సేకరించానుకుంటు న్నామని, , కొన్ని డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. కేసు దర్యాప్తులో పాల్గోనటానికి షోవిక్, మిరాండా ఇద్దరికీ తపిఖీ సమయంలో సమన్లు అందజేసినట్లు వారు తెలిపారు. అనంతరం ఇద్దరిని విచారణ కోసం ముంబయిలోని తమ కార్యాలయానికి తీసుకువెళ్లినట్టు నార్కోటిక్స్ కంట్రోల బ్యూరో మీడియాకు తెలిపింది. షోవిక్ తోపాటు డ్రగ్ డీలర్లు జైద్ విలాత్ర, బిసిత్ పరిహార్లను కూడా అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఎన్సీబీ అధికారులు మొత్తం ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.