జెఇఇ, నీట్ పరీక్షల వాయిదా కుదరదన్న సుప్రీం కోర్టు

0
65

ఆరు ప్రతిపక్ష-పాలిత రాష్ట్రాల అభ్యర్ధనను తోసిపుచ్చిన సర్వోన్నత న్యాయస్థానం
కరోనావైరస్ సంక్షోభం కారణంగా ఇంజనీరింగ్,వైద్య పరీక్ష జెఇఇ (జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్) అలాగే నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్)లను వాయిదా వేయాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇలా జరగటం ఇది రొండో సారి. ప్రతిపక్ష పాలనలో ఉన్న ఆరు రాష్ట్రాలు తన మునుపటి ఉత్తర్వులను సమీక్షించి, లక్షలాది మంది విద్యార్థుల భద్రత కోసం పరీక్షలను నిలిపివేయాలని కోర్టును కోరాయి. న్యాయమూర్తులు అశోక్ భూషణ్, బిఆర్ గవై, కృష్ణ మురారి తమ చాంబర్లలో పిటిషన్ ని పరిశీలించిన మీదట దానిలో ఎలాంటి యోగ్యత లేదని చెప్పారు. “మా మునుపటి నిర్ణయాన్ని పున పరిశీలించినందుకు ఎటువంటి కేసు లేదు” అని ఉన్నత న్యాయస్థానం తెలిపింది.
11 రాష్ట్రాలకు చెందిన 11 మంది విద్యార్థులు ఇదే విధమైన అభ్యర్థనను ఆగస్టు 17 న సుప్రీంకోర్టు తిరస్కరించింది. మహారాష్ట్ర, బెంగాల్, పంజాబ్, రాజస్థాన్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, పుదుచ్చేరి విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా తన నిర్ణయాన్ని పునపరిశీలించాలని కోర్టును అభ్యర్థించాలని నిర్ణయించాయి. ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వు విద్యార్థుల “జీవన హక్కు” ని పొందడంలో విఫలమైందని, కోవిడ్-19 మహ మ్మారి సమయంలో పరీక్షలు నిర్వహించడంలో ఎదుర్కోవాల్సిన ఇబ్బందులను విస్మరించిందని రాష్ట్రాలు పేర్కొన్నాయి. విద్యార్థుల విద్యాసంవత్సరం వృథా కాకుండా, అలాగే వారి ఆరోగ్య భద్రత విషయంలో రాజీ పడకూడదనే రెండు అంశాలను పరీక్షలను పరిగణలోకి తీసుకని పరీక్షలు వాయిదా వేయాలని వారు పిటీషన్ లో కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here