బీజేపీ ఐటీ సెల్ విభాగం పనితీరుపై ఆ పార్టీ సీనియర్ నేతసుబ్రమణియన్ స్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో పనిచేసే కొంతమంది నకిలీ ఐడీలతో తనపై వ్యక్తిగత దాడులకు దిగుతున్నారని మండిపడ్డారు. ఈ విషయంపై తన ఫాలోవర్లు ఆగ్రహంతో ఉన్నారని, వారు ఎదురుదాడికి దిగేతే అందుకు తాను బాధ్యత వహించబోనని స్పష్టం చేశారు.
‘‘మాది మర్యాద పురుషోత్తముల పార్టీ. రావణ, దుశ్శాసనులు ఇక్కడ లేరు. ఇటువంటి విషయాలను నేను పెద్దగా పట్టించుకోను గానీ.. గొడవలు సృష్టించే వాళ్లను బీజేపీ.. పదవి నుంచి తీసేయాలి’’ అంటూ మరో ట్వీట్లో ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయపై విరుచుకుపడ్డారు. అయితే దీనికి అసలు కారణం ఏంటనన్నదిమాత్రంసుబ్రమణియన్ స్వామి స్వామి చెప్పలేదు.
మోడీ ప్రభుత్వానికి, రామ మందిరాని తాను వ్యతిరేకం అంటూ సోషల్ మీడియాలో వరసగా వీడియోలు పోస్ట్ చేయటం సుబ్రమణియన్ స్వామికి కోపం తెప్పించింది. అలాగే గత కొన్ని రోజులుగా ఆయన జెఇఇ-నీట్ పరీక్షలపై బీజేపీ వైఖరితో విభేదిస్తున్నారు. విద్యార్థుల నుంచి తీవ్మ వ్యతిరేకత వచ్చినప్పటికీ పరీక్షలు నిర్వహించాలని మోడీ ప్రభుత్వం నిర్ణయించటాన్ని సుబ్రమణియన్ స్వామి తప్పు పట్టారు. ఇది ఇలా ఉంటే తనపై స్వామి చేపిన వ్యాఖ్యలపై అమిత్ మాల్వియా స్సందించలేదు.