కరోనా సంక్షోభంలో అన్ని వ్యాపారాలు కుదేలయ్యాయి. కానీ ఫార్మాతోపాటు శానిటైజర్లు, మాస్కులు, గ్లౌజుల తయారీదారులకు మాత్రం గిరికీ భారీగా పెరిగింది. డిమాండ్ పెరగటంతో అక్రమార్కులు రంగం లోకి దిగారు.
ఖాదీ పేరుతో వందలాది కోట్లను ఆర్జించారు. అదేలా అంటే…లాక్డౌన్ల ను తమకు అనుకూలంగా మా ర్చుకుని ఇబ్బడిముబ్బడిగా ఖాదీ ఉత్పత్తులను మార్కెట్లోకి డంప్ చేశారు. అనేక ఇ-కామర్స్ సంస్థ లతో ఒప్పందాలు కుదుర్చుకుని ఆన్లైన్ అమ్మకాలకు తెరలేపారు. ఇందులో తప్పేమీ లేదు కానీ.. న కిలీ ఉత్పత్తులను పంపించి వినియోగదారులను బురిడీ కొట్టించారు.
శానిటైజర్లు, విటమిన్-సి సీరమ్, ఖద్దరు మాస్కులు, కుర్తాలు, జాకెట్లు వంటి దుస్తులు, సౌందర్య సాధ నాలు, హెర్బల్ సబ్సులు, షాంపూలు, మూలికా మెహందీలు, హెయిర్ ఆయిల్.. ఇలా అనేక నకిలీ ఉ త్పత్తులను ‘ఖాదీ ఇండియా’ పేరుతో మార్కెట్‌ను ముంచెత్తారు.
ఈ నకిలీ ఉత్ప్తత్తులలో .. లీటరు శానిటైజర్ ధర రూ.377లు కాగా, 5 లీటర్ల శానిటైజర్ ధర రూ.1,709 లుగా ఆన్లైన్లో విక్రయిస్తున్నారు. ఇంకా విటమిన్-సి సీరమ్ ధర రూ.545లు మొదలుకొని రూ.645 వరకూ, 200 ఎం.ఎల్. రెడ్ ఆనియన్ షాంపూ ధర రూ.395లు, రెడ్ ఆనియన్ హెయిర్‌మాస్క్ ధర 945 రూపాయలు, బయో యాక్టివ్ హెయిర్ ఆయిల్ ధర రూ.595లుగా అమ్మకాలు సాగిస్తున్నారు.
వినియోగదారులు మాత్రం ఖాదీ ఇండియా పేరును చూసి కేవీఐసీ ఆధ్వర్యంలోనే ఇవి మార్కెట్ అవుతు న్నాయని భావిస్తూ ఆన్లైన్లో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ వంటి పోర్టల్స్‌లో కొనుగోలు చేసి మోస పోయారు.అయితే మోసం ఎన్నాళ్లో దాగదు కదా. వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వచ్చిన నేప థ్యంలో కేవీఐసీ వెంటనే స్పందించింది. అప్పటికే జరగరాని నష్టం జరిగిపోయింది.
ఏప్రిల్ – ఆగస్టు మధ్య కాలంలో వందల కోట్లాది రూపాయల వ్యాపారం సాగినట్లు సమాచారం. ఖాదీ నకి లీ ఉత్పత్తులను విక్రయించేందుకు ఖాదీ ఇండియా బ్రాండ్‌ను ఉపయోగించినందుకు 1,000 సంస్థలకు నోటీసులను జారీ చేసినట్లు కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వశాఖ ఇటీవల ప్రక టించింది.
నకిలీ ఖాదీ ఉత్పత్తులకు వేదికగా ఉన్న ఇ-కామర్స్ సంస్థలను అమ్మకాలు జరపకూడ దని ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొంది. ఖాదీ ఇండియా పేరును వినియోగించడం ద్వారా వినియోగదారుల్లో ఈ వస్తు వులు నిజమైన ఖాదీ ఉత్పత్తులుగా ఆన్లైన్ కొనుగోలుదారులను తప్పుదోవ పట్టించినట్లు తెలిపింది.
లాక్డౌన్ నెలల్లో నకిలీ ఖాదీ ఉత్పత్తులు విచ్చలవిడిగా దేశవ్యాప్తంగా విస్తరించినట్లు అభిప్రాయపడింది. ఇదిలా ఉండగా ఖాదీ పేరుతో శానిటైజర్లు, మాస్కులు, సౌందర్య సాధనాలను అనధికారికంగా విక్రయిం చినందుకు ఖాదీ ఎస్సెన్షియల్స్, ఖాదీ గ్లోబల్ అనే రెండు సంస్థలకు కేవీఐసీ లీగల్ నోటీసులు సైతం జారీ చేసింది. ఇదే సమయంలో ముంబై హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న ఫాబిండియా నుంచి రూ.500 కోట్ల నష్ట పరిహారాన్ని కూడా కేవీఐసీ కోరినట్లు కేంద్రమంత్రిత్వశాఖ పేర్కొంది.