బాబ్రీ విధ్వంసం కేసులో నేడు తుదితీర్పు

1
157

1992 బాబ్రీమసీదు కూల్చివేత కేసులో ప్రత్యేక న్యాయస్థానం ఇవాళ తుదితీర్పు ఇవ్వనుంది. తీర్పు వెలువరించే రోజు నాటికి జీవించి ఉన్న 32 మంది ముద్దాయిలు కూడా కోర్టు ఎదుట హాజరుకావాలని సీబీఐ జడ్జి ఎస్‌కే యాదవ్‌ 16వ తేదీన ఆదేశించారు. ముద్దాయిల్లో మాజీ ఉపప్రధాని ఎల్‌కే అడ్వాణీ, కేంద్ర మాజీ మంత్రులు మురళీ మనోహర్‌ జోషి, ఉమాభారతి, ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్‌ సింగ్, వినయ్‌ కతియార్, సాధ్వి రితంబర ఉన్నారు. తీర్పునిచ్చే రోజు కరోనా ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న ఉమాభారతి, కళ్యాణ్‌ సింగ్‌ కోర్టులో హాజరవుతారో లేదో తెలియరాలేదు. కళ్యాణ్‌ సింగ్‌ ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉండగా బాబ్రీ విధ్వంసం జరిగింది. రాజస్తాన్‌ గవర్నర్‌గా పదవీ కాలం ముగియగానే గత సెప్టెంబర్‌ నుంచి, ఆయనపై విచారణ కొనసాగింది.
ఇదిలావుంటే, కేసు విచారణ జరుగుతుండగానే 16 మంది మరణించారు. దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసును సీబీఐ విచారించింది. ఈ క్రమంలో సీబీఐ 351 మంది సాక్షుల్ని న్యాయస్థానం ఎదుట ప్రవేశపెట్టింది. 600 డాక్యుమెంట్లను రుజువులుగా చూపించింది. 48 మందిపై అభియోగాలు నమోదు చేయగా, విచారణ జరుగుతుండగానే 16 మంది ప్రాణాలు కోల్పోయారు. 16వ శతాబ్దం నాటి బాబ్రీ మసీదుని కూల్చివేతలో పాల్గొన్న కరసేవకుల్నిఈ కేసులో నిందితులందరూ కుట్ర పన్ని వారిని రెచ్చగొట్టారని సీబీఐ న్యాయస్థానం ఎదుట వాదనలు వినిపించింది. ఈ తీర్పు కోసం యావత్ దేశం ఆసక్తితో ఎదురుచూస్తోంది.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here