ఒక శకానికి ఆఖరు వీడ్కోలు.. ముగిసిన అంత్యక్రియలు

0
242

గాన గంధర్వుడు ఎస్‌.పి. బాలసుబ్రమణ్యం భూమి మీది నుంచి ఆఖరు వీడ్కోలు తీసుకున్నారు. బాలుకు ఎంతో ఇష్టమైన తమిళనాడులోని తారమరైపాక్కం ఫామ్‌ హౌస్‌లో ఆయన అంత్యక్రియలు ముగిశాయి.తమిళనాడు ప్రభుత్వం బాలు అంత్యక్రియలను ప్రభుత్వ లాంచనాలతో జరిపించింది. ప్రభుత్వం తరపు నుంచి గౌరవ వందనం సమర్పించి.. గాలిలో తుపాకులు పేల్చి ప్రభుత్వం నివాళులు అర్పించింది. అనంతరం ఆయన ఖననం వీర శైవ జంగమ సాంప్రదాయం ప్రకారం జరిగింది. ఈ సాంప్రదాయం ప్రకారం బాలుని కూర్చొన్న పొజీషన్‌లో ఖననం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ తరపు నుంచి కొందరు, బాలు కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు కొందరు మాత్రమే హాజరయ్యారు. ప్రస్తుతం అభిమానులను దూరం పెట్టినప్పటికీ.. త్వరలోనే బాలు సమాధిని అద్భుతంగా తీర్చిదిద్ది సందర్శనా స్థలంగా చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here