బాలు బయటపడ్డట్టేనా…

0
124

కుమారుడు చెప్పబోయే శుభవార్త ఇదేనా…


రోనా బారిన పడి గత కొద్ది రోజులుగా ట్రీట్మెంట్ తీసుకుంటున్న సుప్రసిద్ధ సినీ నేపథ్య గాయకుడు ఎస్సీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం కుదుటపడ్డట్టే కనిపిప్తోది. ప్రస్తుతం ఆయన చెన్నయ్ లోని ఎంజీఎం ఆస్ప్రతిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయనను ఐసీయూలో ఉంచి ఎక్మో సాయం అందిస్తూ, ఫిజియో థెర‌పీ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ ఓ వీడియోను అభిమానులతో షేర్ చేసుకున్నారు. వ‌రుస‌గా నాలుగో రోజు నాన్న ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉందని. మెల్ల‌గా కోలుకుంటున్నారని దేవుని ఆశీస్సులు, అభిమానుల ప్రార్ధ‌న‌ల‌తో సోమ‌వారం మంచి శుభ‌వార్త వినోబోతున్నారని ఆయన ఆ వీడియోలో దీంతో బాలు ఆరోగ్యం నయమైందని , బహుశా సోమవారం బాలు ఐసీయూ నుండి జ‌న‌ర‌ల్ వార్ఢ్‌కు రావచ్చని చరణ్ మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు. అభిమానులు కూడా ఆ గుడ్ న్యూస్ ఇదేనని బావిస్తున్నారు.

బహుభాషా గాయకుడుగా దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు బాలు. హీందీతో సహ పలు భాషలలో పాడిన పాటల ద్వారా జాతీయ అవార్డులు అందుకున్న ఘనత ఆయనదే. సినిమాల్లో అంతగా పాడకపోయినా ఆయన స్వరం టీవీల్లో నిత్యం వినిపిస్తూనే ఉంది. కొద్ది రోజుల క్రితం ఆయన కరోనా బారినపడి పరిస్థితి సీరియస్ గా ఉందని తెలియగానే అభిమానులు ఆయనకోసం ప్రార్థించారు. తెలుగు,తమిళ, మళయాల సహ దేశంలోని పలువురు సినీ ప్రముఖులు ఆయన కోలుకుని తిరిగి పాటలు పాడతారని ఆకాంక్షించారు. బాలు ఆరోగ్యం నిలకడగా ఉండటంతో వారి ప్రార్థనలు ఫలించినట్టే కనిపిప్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here