‘ఆర్ఎక్స్ 100’ దర్శకుడు అజయ్ భూపతి కొత్త ప్రాజెక్ట్ ‘మహాసముద్రం’ సిద్ధమవుతోంది. ఇందులో హీరోయిన్గా సమంతను అనుకున్నారు. ఆమె కూడా ప్రాజెక్టును ఓకే చేసింది. అయితే ఉన్నట్టుండి సమంత ఈ సినిమా నుంచి తప్పుకుంది.
సమంత స్థానంలో ‘కౌసల్య కృష్ణమూర్తి’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’ హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ నటించనుంది. ఇందులో ఆమె శర్వానంద్‌కు జోడిగా నటించనుంది. శర్వానంద్ తో పాటు మరో హీరోగా సిద్దార్థ కూడా ఇందులో నటిస్తున్నాడు.
ఉన్నపళంగా సమంత ఈ సినిమా నుంచి ఎందుకు తప్పుకున్నారో తెలియదు ..కానీ హీరో సిద్దార్థ కారణం కావచ్చని టాలీవుడ్ టాక్. గతంలో సిద్ధార్థ, సమంత ప్రేమించుకున్నారని , పెళ్లి కూడా చేసు కోబోతున్నారని ఎంటర్టెయిన్మెంట్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. వారిద్దరు జంటగా కనిపిం చడం, శ్రీకాళహస్తి ఆలయంలో కలిసి రాహుకేతు పూజ చేయడంతో ఆ ప్రచారం జరిగింది. తర్వాత ఏం జరిగిందో తెలీదు కానీ వీరిద్దరు విడిపోయారు.. ఆ తర్వాత సమంత నాగచైతన్యను పెళ్లి చేసుకుని సెటిలైంది.
అతడిని పెళ్లి చేసుకుని ఉంటే సావిత్రి గారి జీవితంలో ఎలాంటి కష్టాలు సంభవించాయో నా జీవితం కూడా అలాగే అయ్యేది. కానీ నేను ముందే పసిగట్టడంతో బ్రతికుపోయా. అందువల్లే ఇప్పుడు నా జీవితం సాఫీగా సాగిపోతోంది. నేను జీవితంలో తీసుకున్న పెద్ద నిర్ణయాల్లో ఇది ఒకటి. చైతూ నాకు దేవుడిచ్చిన కానుక’ అంటూ ఇటీవల ఓ ఇంట్వర్యూలో సమంత చెప్పింది.
మరోవైపు, కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న సిద్ధార్థ్ ‘మహా సముద్రం’తో మళ్లీ ఎంట్రీ ఇస్తున్నాడు.