బాలూ వారికి ఏమవుతారు…

5
332

వారికి ఏమవుతాడని అంతమంది దారి పొడవునా పూలు పట్టుకుని ఎదురు చూస్తూ నిలబడ్డారు? అన్ని వందలమంది బైకుల మీద స్వచ్చందంగా ర్యాలీ తీశారు. సంగీత జ్ఞానం లేని పామరులకు కూడా ఆయన ప్రతిభ అంత స్పష్టంగా కనబడుతోంది. ఇక్కడ కులాలు మతాలకు ఏమాత్రం ప్రాధాన్యత లేదు. బాలూ కోసం అభిమానులంతా కన్నీటి పర్యంతమవుతు న్నారు.

బాలూ నోట ఏ పదం వచ్చినా అది పాటే.. “జన్మభూమి నాదేశం నమో నమామి” అన్నా, “నేను సైతం” అంటూ టాగోర్ సినిమాలో పాడినా అంత గాంభీర్యం ఎంత మందికి వస్తుంది? అన్నమయ్య సినిమాలో పాటలు ఎంత మంది అంత ఆర్తితో పాడగలరు? ఒక పాట రికార్డింగ్ అయిపోయి బయటికి వచ్చిన బాలు దగ్గరికి రాఘవేంద్రరావు కన్నీళ్ళతో వెళ్లి ఆలింగనం చేసుకుని ఏమీ మాట్లాడకుండా మాట్లాడలేక వెళ్లిపోయారు.

ఒకసారి పాడుతా తీయగా చిన్న పిల్లల సిరీస్ నడుస్తున్నప్పుడు “మీ వాళ్లందరికీ ప్రైజులు ఇచ్చుకున్నారా” అని ఒక ఉత్తరం రావడాన్ని ప్రస్తావిస్తూ, ఒక పాపని ఎత్తుకుని “వీళ్లంతా కల్మషం లేని పాటని ప్రేమించే పసివాళ్ళు. ఇంకా నేర్చుకునే దశలో ఉన్నారు. మీ కుత్సిత, విషపూరిత మనసులతో పిల్లల మనసులను కలుషితం చేయకండి. పాట పట్ల వాళ్లలో ఉన్న ప్రేమని అలాగే బతకనివ్వాలి అన్నారు బాలు.

సంగీతం తెలిసిన కొన్ని వేల మంది పాడుతా తీయగా కార్యక్రమం చూస్తున్నప్పుడు అనర్హులను విజేతలుగా ప్రకటించే సాహసం ఎవరన్నా చేస్తారా? బ్రాహ్మణ వ్యతిరేక భావజాలంలో నుంచి పుట్టిన తమిళనాడు పార్టీలు హవా నడుస్తున్న తమిళ రాష్ట్రంలో వేలాది మంది కులమతాలకు అతీతంగా రోడ్ల మీదకి వచ్చి అభిమానం తెలపడం కులనిందని తుత్తునియలు చేయడమే.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here