కోవిడ్ -19 బారినపడి చికిత్ప పొందుతున్న సుప్రసిద్ధ సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నఆయన నోటి ద్వారా ఆహారం తీసుకుంటున్నారు, అలాగే ఫిజియోథెరపీ ప్రాక్టీస్ చేస్తున్నారు.
బాలూ తాజా ఆరోగ్య పరిస్థితి గురించి ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ శనివారం వీడియో సందేశంలో వివరించారు. ఐతే, 74 ఏళ్ల బాలు ఇప్పటికీ వెంటిలేటర్ మీదే ఉన్నారు. కరోనా పాజిటివ్ రావటంతో ఆగస్టు 5 న చెన్నైలోని ఎంజిఎం హెల్త్‌కేర్ ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రికి తీసుకువెళ్ళినప్పుడు ఆయ నకు తేలికపాటి కరోనా లక్షణాలు కనిపించాయి, కాని తరువాత పరిస్థితి విషమంగా మారింది. దాంతో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియుకు ) తరలించి లైఫ్ సపోర్ట్త ద్వారా చికిత్స అందించారు.
తన తండ్రి ఆరోగ్యం గురించి వివరాలను పంచుకుంటూ, ఎస్పీ చరణ్ ఒక వీడియో క్లిప్‌లో ఇలా అన్నా డు: “అప్పా ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉంది., ఆయన వెంటిలేటర్ మీదే ఉన్నారు. మిగతా విషయాల్లో అంతా బాగుంది, ఎలాంటి ఇన్ఫెక్షన్ లేదు. పరిస్థితి సంతృప్తి కరంగానే ఉంది. ఊపిరితి త్తులలకు సంబంధించి ఇంకా కొంత మెరుగుదల అవసరం. అతను ఫిజియోథెరపీ చేస్తున్నాడు; అతను కూర్చోగలుగుతున్నారు. ” అని చెప్పు కొచ్చారు చరణ్.