అనురాగ్ కశ్యప్ పై మరో ఆరోపణ..

0
111

ఫిలిం మేకర్ అనురాగ్ కశ్యప్ తనతో అనైతికంగా ప్రవర్తించాడని నటి రూపా దత్తా ఆరోపించారు. ఈ ఘటన 2014లో జరిగిందని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ చాట్ కి సంబంధించిన స్క్రీన్ షాట్లను షేర్ చేసింది.

‘అనురాగ్ సఫర్’ అనే పేరుతో కశ్యప్ తనతో ఛాట్ చేశారని , వివాహిత మహిళలపై ఎలా ఆకర్షితుడయ్యాడో తనకు చెప్పాడని అంది. అనురాగ్ కశ్యప్ ..అనురాగ్ సఫర్ పేరుతో ఫేస్‌బుక్ ఐడిని నడుపుతున్నారని ఘోష్ పేర్కొన్నారు. కశ్యప్ ప్రవర్తన నచ్చక అతనితో మాట్లాడటం ఆపేశానని చెప్పింది.
కశ్యప్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని పాయల్ ఘోష్ ఆరోపించిన నేపథ్యంలో ఈ ఆరోపణలు వచ్చాయి. మరోవైపు, అనురాగ్ సఫర్ అనే వ్యక్తి 2010లో ఆ తరువాత 2016 లో తాను చిత్రనిర్మాత కాదని, కశ్యప్‌తో ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు. 2009 వరకు ఆయన తన యూజర్ నేమ్ లో కశ్యప్‌ను ఉపయోగించటమే ఈ గందరగోళానికి కారణం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here