గత 24 గంటల్లో లక్ష మందికి పైగా కరోనా రోగులకు నయమైంది. 24 గంటల్లో 1,01,468 మంది కారోనా నుంచి బయటపడ్డారు. ఇది ఒక రికార్డు. దీంతో రికవరీలు రోజు రోజుకు పెరుగుతున్నట్టు తెలుస్తోంది. గత నాలుగు రోజులుగా ప్రతిరోజూ 90,000 మంది కోలుకుంటున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది.
ఇక యాక్టివ్ కేసులు 10 లక్షల మార్కుకు దిగువకు రావటం విశేషం. ప్రస్తుతం దేశంలో 9 లక్షల 75 వేల 861యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 75,083 కొత్త కేసులు నమోదయ్యాయి, 1,053 మంది మరణించారు. మొత్తం నావైరస్ కేసుల సంఖ్య 55 లక్షలు దాటింది. ప్రస్తుతం ఆ సంఖ్య 55, 62,664 గా ఉంది. వారిలో 44,97,868 మందికి నయమైంది. కాగా ఇప్పటి వరకు దేశ వ్యప్తంగా మొత్తం 88,935 మంది కరోనా బారినపడి మరణించారని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) కరోనావైరస్ కోసం సెప్టెంబర్ 21 వరకు 6,53,25,779 నమూనాలను పరీక్షించింది. వీటిలో మంగళవారం 9,33,185 నమూనాలను పరీక్షించినట్లు ఐసిఎంఆర్ వెబ్ పోర్టల్ నివేదించింది.