రాజ్యసభ ఎంపి, కర్ణాటక బిజెపి నేత అశోక్ గస్తీ కరోనాతో కన్నుమూశారు. ఆయన వయస్సు 55 సంవత్సరాలు. తీవ్ర అనారోగ్యం బారిన పడిన ఆయన మణిపాల్ ఆసుపత్రిలో చేర్చగా పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. కరోనాకు చికిత్స పొందుతూ గురువారం రాత్రి 10.31 గంటలకు మృతి చెందినట్లు ఆసుపత్రి డైరెక్టర్ మనీష్రారు తెలిపారు. న్యూమోనియాతో కూడిన కోవిడ్-19 లక్షణాలతో ఆయన ఆసుపత్రిలో చేరారు. పలు అవయవాల పనితీరు వైఫల్యం చెందడంతో పరిస్థితి విషమంగా మారింది. ఐసియులో లైఫ్ సపోర్ట్‌పై ఉంచి చికిత్స అందించామని వైద్యులు చెప్పారు. ఉత్తరకర్ణాటకలోని రారుచూర్కు చెందిన ఆయన తొలిసారిగా రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన మృతికి ప్రధాని నరేంద్ర మోడీ, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రభృతులు సంతాపం తెలిపారు.