హైదరాబాద్ జలమయం ..మరో 4 రోజులు వానలు..తెలంగాణలో హై అలర్ట్

0
164


హైదరాబాద్‌లో శుక్రవారం సాయంత్రం నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. శనివారం ఉదయం కల్లా అనేక ప్రాంతాలు వరద ప్రాంతాలను తలపించాయి

నిన్న రాత్రి నుంచి తెలంగాణ అంతటా కంటిన్యూగా వర్షం కురుస్తోంది. మరో నాలుగు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఉరుములతో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ రోజు రాష్ట్రంలోని పలు ప్రదేశాలలో ఉరుములు మెరుపులతో వర్షం పడుతుందని అంచనా వేసింది.

మరోవైపు, హైదరాబాద్ కు ఎల్లో హెచ్చరిక చేశారు. ఆకాశం మేఘావృత తేలికపాటి నుంచి ఓ మాదిరి వర్షం పడొచ్చు.ఈ వర్షాలతో హైదరాబాద్ రోడ్లపై భారీగా నీరు చేరి లోతట్టు ప్రాంతాలు జలమయం కావటం, ట్రాఫిక్ రద్దీ, చెట్లు నేలకూలటం, విద్యుత్ స్తంభాలు పడిపోవటం జరగొచ్చని వాతావరణ శాఖ బావిస్తోంది. ప్రజలు అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉండేలా చూడాలని జిల్లా యంత్రాంగానికి ఐఎండి సూచించింది. అలాగే నగరంలోని నీరు నిలిచే ప్రాంతాలను క్లియర్ చేయాలని మునిసిపల్ కార్పొరేషన్‌కు సూచించింది. మరోవైపు, రెవెన్యూ అధికారులకు సెలవులు రద్దు చేస్తూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శనివారం సర్క్యులర్ జారీ చేశారు. జిల్లా యంత్రాంగం మొత్తం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సర్క్యలర్ లో కోరారు.

శుక్రవారం రాత్రి నుంచి హైదరాబాద్ లో కుండపోత పోస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. టోలిచౌకీ, మెహిదీపట్నం, గొల్కోండ ప్రాంతాల్లోని నివాసాల్లోకి వర్షపు నీరు చేరింది. రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హుస్సేన్‌ సాగర్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. ట్యాంకబండ్‌ ఎన్టీఆర్‌ మార్గ్‌ లో వర్షపు నీరు నిలవడంతో.. ప్రమాదవశాత్తు ఓ కారు డివైడర్‌ను ఢకొీట్టింది. ఈ ప్రమాదం నుంచి కారులో ఉన్న ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. నగర వ్యాప్తంగా జీహెచ్‌ఎంసీ, డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.హైదరాబాద్ శుక్రవారం సాయంత్రం నుండి నగరంలోని అనేక ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here