మరో ఐదు రోజుల పోలీస్ కస్టడీకి రాగిణి

0
96

డ్రగ్ప్ కేసులో అరెస్టయిన కన్నడ నటి రాగిణి మరో ఐదు రోజుల పోలీసు కస్టడీకి వెళ్లారు. ఆమె విచారణకు సహకరించడం లేదని, ఇంకో 10 రోజులు కస్టడీకి అనుమతి ఇవ్వాలని క్రైమ్ బ్రాంచ్ తరపు న్యాయవాదులు న్యాయమూర్తి జగదీష్ ని కోరారు. అయితే ఐదు రోజులకు మాత్రమే అనుమతి ఇచ్చారు. దీంతో ఆమెని విచారించి మరింత సమాచారం సేకరించానున్నారు పోలీసులు.
రాగిణి అపార్ట్ మెంట్ లోని గంజాయి సిగరెట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆ సిగరెట్లను ల్యాబ్ కు పంపించారు. రాగిణి పోలీసు కస్టడీ ముగిసిపోవడంతో బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆమెను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరుపరిచారు. రాగిణి విచారణకు సహకరించడం లేదని పోలీసులు చెప్పడంతో మరో ఐదు రోజులు ఆమెను విచారణ చెయ్యడానికి కస్లడీలోకి తీసుకోవాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఇదే సమయంలో రాగిణి న్యాయవాదులు కోర్టులో లేకపోవడంతో ఆమె బెయిల్ పిటిషన్ వాయిదా పడింది. ముంబాయి నుంచి ప్రత్యేక న్యాయవాదులు బెంగళూరు వచ్చి రాగిణికి బెయిల్ ఇప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here