ఆ విషయంలో ఎలిజబెత్ టేలర్ ని మించిపోయిన మడోన్నా…

1
132


సుప్రసిద్ధ హాలీవుడ్ నటి ఎలిజబెత్ టేలర్ 1991లో తన కన్నా20 ఏళ్లు చిన్నవాడైన ల్యారీ ఫోర్టెన్ స్కీ అనే ఒక తాపీ కార్మికుడిని పెళ్లి చేసుకుని సంచలనం రేపింది. అంతేకాదు అమెకు అది ఎనిమిదో పెళ్లి ..అప్పటికి ఆమె వయస్పు 60. ల్యారీ ఆమెకు చివరి మొగుడు. ఇది ఎందుకు చెబుతున్నానంటే అప్పట్లో మీడియా ఇంతలా విస్తరించలేదు.అయినా టేలర్ పెళ్లిళ్ల వార్తలు ప్రపంచమంతా తెలిసేవి.

ఇప్పడు మీడియా, సోషల్ మీడియా ఇంతలా విస్తరించిన వేళ్ల ఎలిజబెత్ టేలర్ గురించి చెబితే అందులో పెద్ద విశేషం ఏముందిలే అంటారు. విఖ్యాత పాప్ స్టార్ మడోన్నా ..టేలర్ కన్నా రెండాకులు ..కాదు కాదు ..నాలుగాకులు ఎక్కువే చదివింది. అయితే అది పెళ్లిళ్ల విషయంలో కాదు ..ప్రేమికుల విషయంలో. తన రొమాంటిక్ లైఫ్ లో ఒక్కరు తప్ప ఆమెతో సంబంధం పెట్టుకున్న వారంతా వయస్పులో ఆమె కన్నా చిన్నవారే.

ప్రస్తుతం 62 ఏళ్ల మడోనా తనకన్నా 36 ఏళ్లు చిన్నవాడైన కరేబియన్ కుర్రాడితో ప్రేమలో మునిగిపోయింది. ఇటీవల ఆమె తన 62వ పుట్టిన రోజు ప్రియుడితో కలిసి జరుపుకుంది. మడోన్నా లవర్స్ లిస్టు చెబితే చాంతాడంత అవుతుంది. మడో న్నాలేటెస్ట్ బాయ్ ఫ్రెండ్ అహ్లమాలిక్ విలియమ్స్ వయస్పు 26 ఏళ్లు.

గత డిసెంబర్ లో మడోన్నా తన కొత్త టాయ్‌బాయ్ లవర్, బ్యాక్ డ్యాన్సర్ అహ్ల మాలిక్ విలియమ్స్‌తో కలిసి మయామిలో తొలిసారి జనం మధ్య వీకెండ్ సెలబ్రేట్ చేసుకుంది.అప్పటి నుంచి బ్రిటిష్ టాబ్లాయిడ్ మీడియాకు ఈ జంట పెద్ద ఐటెమ్ గా మారిపోయింది. వీరి మధ్య 36 సంవత్సరాల ఏజ్ గ్యాప్ ఉండటం కూడా దీనికో కారణం. ఎందుకో తెలియదు కాని గత కొన్నేళ్లుగా మడోన్నాతనకన్నాచాలా చాలా చిన్నవాళ్లయిన యువకులతో మాత్రమే డేటింగ్ కు ఎంచుకుంటోంది. దాంతో ఇటీవల ఆమె యువ ప్రేమికుల జాబితా పెరిగిపోతోంది.

62 ఏళ్ల వయస్సులో కూడా మడోన్నా పాతికేళ్ల కుర్రాళ్లని అవలీలగా పడేస్తో్ంది. దానికి కారణ ఆమె అందం ..అకర్శణా.. పేరు ప్రఖ్యాతులా ..లేదండే డబ్బా? మడొన్నా రొమాంటిక్ లైఫ్ లో ఒక్కడు మాత్రమే ఆమె కన్నా పెద్ద వాడు. అతని పేరు వారెన్ బీటీ ..ఆమె కన్నా 21 ఏళ్లు పెద్దవాడు. 1989- 1990 మధ్య ఏడాది పాటు ఎఫైర్ సాగింది. ఇదొక్కటి మినహాయిస్తే, ఇటీవలి ఆమెతో రిలేషన్ షిప్ లో ఉన్న కెవిన్ సంపాయో 33 సంవత్సరాలు ఆమె కన్నా చిన్న, తైమూర్ స్టెఫెన్స్ (30 సంవత్సరాలు ఆమె జూనియర్) బ్రహిమ్ జైబాత్ (29 సంవత్సరాలు ఆమె జూనియర్) తో ఇంకా చాలా మంది కుర్ర లవర్స్ ఆమె లిస్టులో ఉన్నారు. ఈ క్వీన్ ఆఫ్ పాప్ లేటెస్ట్ లవర్ బాయ్స్ తో ఏకంగా ఓ చార్ట్ వేశారు.

మడోన్నా తన జీవితంలో ఇద్దరు పురుషులతో మాత్రమే వివాహ బంధంలో చిక్కుకుంది. నటుడు షాన్ పెన్ ను 1985లో వివాహం చేసుకుని నాలుగేళ్లు కాపురం చేసి విడిపోయింది. తరువాత బ్రిటిష్ దర్శకుడు గయ్ రిచ్చిని 2000 సంవత్పరంలో పెళ్లి చేసుకుని ఎనిమిదేళ్లు కాపురం చేసి 2008లో విడిపోయింది. వీరికి ఒక కొడుకు. 90 ల మధ్యలో తన బాడీగార్డ్ తో ఎఫైర్ పెట్టుకుని ఒక కూతురుని కంది.

మడోన్నా ఎఫైర్స్ ని పక్కన పెడితే ఆమె ఒక మంచి మానవత్వం ఉన్న వ్యక్తి. నలుగురు పిల్లలను దత్తత తీసుకుని కన్నబిడ్డల్లా పెంచుతోంది. అంతేకాదు ఆమె అనేక చారిటీ కార్యక్రమాల్లో పాల్గొంటోంది.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here