ఇల్లు గుల్ల చేస్తున్న కరోనా …ప్రైవేట్ హాస్పిటళ్ల టెస్టుల దందా

1
118

రోనా మహమ్మారి సామాన్యుడి చావుకొచ్చింది. సర్కార్ తీరుతో ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తే ఇల్లు గుల్ల చేసి పంపిస్తున్నారు. ప్రభుత్వమేమో పట్టించుకోదు. సర్కార్ ఆస్పత్రికి వెళ్లినా వైద్యులు ఉండరు..ఉన్నా మందులు ఇచ్చేవారు కనిపించరు. ఇదే ఛాన్సని ప్రైవేట్ ఆస్పత్రులు బరి తెగిస్తున్నాయి. కరోనా పేరుతో కాసుల కక్కర్తికి పాల్పడుతున్నాయి. అనారోగ్యంతో వచ్చిన వారిని టెస్టుల పేరుతో దోచుకుంటున్నాయి. నాడి పట్టకుండా, బీపీ చూడకుండానే టెస్టులు మాత్రం ఫుల్ గా రాస్తున్నరు డాక్టర్లు. వచ్చింది కరోనా జ్వరమో.. వైరల్ జ్వరమో తెలియాలంటే తప్పదని భయపెడుతున్నరు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. వేలాదిగా ఉన్న ప్రైవేట్ హాస్పిటల్స్ కరోనా టైంలోనూ అక్రమంగా డబ్బులు దోచుకుంటున్నాయి. ఇష్టారీతిన టెస్టులు చేయిస్తూ పేషెంట్ల జేబులకు చిల్లులు పెడుతున్నాయి. ఆర్ఎంపీలకు కమీషన్లు ఇస్తుండటంతో వారంతా తమ వద్దకు వచ్చే రోగులకు పెద్ద ఆస్పత్రులకు పంపిస్తున్నారు. అక్కడికి వెళ్లాకా కరోనా పేరుతో భయపెట్టి.. రోగులను దోచుకుంటున్నారు.


ప్రైవేట్ ఆస్పత్రుల కాసుల కక్కుర్తి
వైరల్ జ్వరమో.. కరోనా జ్వరమో తెలియక పేషెంట్లు భయంతో ప్రైవేట్ హాస్పిటళ్లకు వెళ్తున్నారు. అక్కడకువచ్చారంటే చాలు డిసీజ్ డయాగ్నసిస్ పేరుతో పదుల సంఖ్యలో టెస్టులు రాస్తున్నారు. సాధారణ రోజుల్లో జ్వరం వస్తే టైఫాయిడ్, మలేరియా, హిమోగ్రామ్, యూరిన్, బ్లడ్ టెస్టుల వంటివి చేస్తారు.. ఇది కూడా జ్వరం ఎక్కువగా ఉంటేనే చేసేవారు. వీటికి రూ.600 నుంచి 800 వరకు తీసుకునేవారు. కానీ ఇప్పుడు వీటికి రూ.1,200 నుంచి 2000 వరకు వసూలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే వీటితో పాటు ఎలక్ట్రోలైట్స్, చెస్ట్ ఎక్స్ రే, సిటీ స్కాన్ తదితర టెస్టులూ చేయిస్తున్నారు. సాధారణ రోజుల్లో అయ్యే ఖర్చుకు ప్రస్తుతం కరోనా టైం ఖర్చు రెండు నుంచి మూడు రెట్లు అధికంగా ఉంటుందని హాస్పిటల్ వర్గాలే చెబుతున్నాయి. దగ్గు ఉంటే చాలు చెస్ట్ ఎక్స్ రేలు, చెస్ట్ సిటీ స్కాన్, కిడ్నీ సంబంధ టెస్టులు రాస్తున్నారు. చెస్ట్ఎక్స్ రేకు రూ. 400 వరకు తీసుకుంటున్నారు. శ్వాస సంబంధిత సిటీ స్కాన్‌కు గతంలో రూ.5వేల వరకు తీసుకునే వారు. ఇప్పుడు రూ.9 వేల దాక వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.


కమీషన్ల దందా
హాస్పిటల్స్, ఆర్ఎంపీల మధ్య కమీషన్ల దందా జోరుగా సాగుతోంది. చెస్ట్ఎక్స్ రే, చెస్ట్ సిటీ స్కాన్ ల ద్వారా కరోనా పేషెంట్లను గుర్తిస్తున్న కొందరు డాక్టర్లు ట్రీట్ మెంట్‌కు వేలల్లో గుంజుతున్నారు. మరి కొందరు 20 నుంచి 30 శాతం కమీషన్ తీసుకుంటూ కరోనా పేషెంట్లను హైదరాబాద్‌లోని హాస్పిటల్స్‌కు పంపిస్తున్నారు. ఇక పల్లెల్లోని ఆర్ఎంపీలు కమీషన్లకు ఎగబడుతున్నారు. ఎవరికి జ్వరం వచ్చినా హాస్పిటల్స్‌కు రెఫర్ చేయడం.. ముందస్తుగా కుదుర్చుకున్న ఒప్పందం మేరకు 20 నుంచి 30 శాతం కమీషన్లు తీసుకుంటున్నారు. పేషెంట్‌కు అయ్యే బిల్లులో దీన్ని వసూలు చేస్తున్నారు. ఈ కమీషన్లు ఇవ్వాల్సి ఉండడంతో హాస్పిటల్స్, ల్యాబ్ ల మేనేజ్మెంట్లు పేషెంట్ల వద్ద ఎక్కువ మొత్తం డబ్బులు వసూలు చేస్తున్నాయి.అడ్డగోలు వసూళ్లపై పట్టించుకునే వారు కరువయ్యారు. సర్కార్ కనీస పర్యవేక్షణ లేకపోవడంతో ఎవరి ఇష్టం వచ్చినట్లువారు వ్యవహరిస్తున్నారు.
-ఎస్.ఎస్.యాదవ్,సీనియర్ జర్నలిస్టు

1 COMMENT

  1. My wife and i were very thrilled when Raymond managed to round up his web research with the precious recommendations he was given while using the weblog. It is now and again perplexing to simply possibly be releasing tricks which usually the rest might have been trying to sell. We really understand we now have you to thank for this. Those illustrations you made, the straightforward website navigation, the relationships your site make it possible to promote – it is mostly wonderful, and it is making our son in addition to us understand this topic is thrilling, which is certainly wonderfully vital. Thanks for the whole thing!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here