మళ్లీ కళ్ల ముందుకు ప్రిన్సెస్ డయానా..

0
44

యావత్ ప్రపంచం మనసు గెలిచిన బ్రిటిష్ యువరాణి ప్రిన్సెస్ డయానా మరణించి దాదాపు పాతికేళ్లయినా ఆమె చిత్రం ఇంకా మన స్మృతి పథం నుంచి వీడి పోలేదు. ఆమె చనిపోయేనాటికి చిన్న పిల్లలుగా ఉన్నఇద్దరు కుమారులు తమ తల్లి పట్ల ప్రేమతో ఆమె విగ్రహాన్ని ఓ అద్భుతమైన కళా ఖండంగా రూపొందిస్తున్నారు.


డయానా భర్త ప్రిన్స్ చార్లెస్, ఆమె పెద్ద కుమారుడు ప్రిన్స్ విలియం, చిన్న కుమారుడు ప్రిన్స్ హ్యారీ మూడేళ్ల క్రితమే ఆమె విగ్రహ నిర్మాణం పనికి పూనుకున్నారు. వీరి ఆద్వర్యంలోనే ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ డయానా విగ్రహం రూపు దిద్దుకుంటోంది.


డయానా విగ్రహాన్ని వచ్చే ఏడాది జులై1న ఆమె 60 వ జయంతి సందర్భంగా ఆవిష్కరిస్తారు. ఆ రోజు లండన్ ప్యాలెస్ లో ని ఉద్యానవనంలో విగ్రహాన్ని ప్రతిష్టిస్తారని కెన్సింగ్టన్ ప్యాలెస్ ప్రకటించింది. తన తల్లి 20వ వర్ధంతిని పురస్కరించుకుని 2017 లో ఈ విగ్రహ ప్రతిపాదన చేశారు. వచ్చే సోమవారం నాటికి ప్రిన్సెస్ డయానా ఈ లోకాన్ని వీడి 23 సంవత్సరాలు అవుతుంది.
వాస్తవానికి ఈ విగ్రహ నిర్మాణం పనులు ఇప్పటికే పూర్తి కావాల్సి వుంది. ఐతే కరోనా కారణంగా జాప్యం జరిగింది. అయినా అనుకున్న సమయానికి విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుందని రాయల్ ప్యాలెస్ వర్గాలు తెలిపాయి. ప్రముఖ శిల్పి ఇయాన్ ర్యాంక్-బ్రాడ్లీ ఈ విగ్రహ రూపకల్పన చేస్తున్నారు.


1997, ఆగస్టు 31న ప్రిన్సెస్ డయానా పారిస్ లో జరిగిన కారు ప్రమాదంలో మరణించారు. అప్పటికి ప్రిన్స్ విలియమ్ కు 15 ఏళ్లు కాగా ప్రిన్స్ హ్యారీ పన్నేండేళ్ల బాలుడు. డయానాకు నివాళిగా లండన్ లో పలు జ్ఞాపక చిహ్నాలు ఏర్పాటయ్యాయి. వాటిలో ప్రధానమైనవి హైడ్ పార్క్ లోని డయానా మామోరియల్ ఫౌండేషన్, సెయింట్ జేమ్స్ స్ట్రీట్ లోని డయానా మెమోరియల్ వాక్ ప్రధానమైనవి. అలాగే 20 వ వర్థంతి సందర్భంగా కెన్సింగ్టన్ ప్యాలెస్ లో వైట్ గార్డెన్ ని ఏర్పాటు చేశారు.
బ్రిటన్ లోని స్పెన్సర్ కుటుంబంకి చెందిన ఎడ్వర్డ్ జాన్ స్పెన్సర్, అతని మొదటి భార్య ఫ్రాన్సిస్ రూత్ రోచేల నాలుగో సంతానం డయానా.


1977 నవంబరు 16 న డయానా తొలిసారి ప్రిన్స్ చార్సెస్ ని చూసినపుడు ఆమె పదహారేళ్ల పడతి. చార్లెస్ ఆమెపై తొలి చూపులేనే మనసు పారేసుకున్నాడు. తరువాత మూడేళ్లకు ..అంటే 1980 లో తమ స్కాటిష్ భవనానికి డయానాను ఆహ్వానించి అమ్మమ్మ ఎలిజెబెత్ మహారాణి, తాత ఫిలిప్స్ కి పరిచయం చేసాడు. వారందరికి డయానా బాగా నచ్చింది. 1981 ఫిబ్రవరి 6 వ తేదిన ప్రిన్స్ చార్లెస్ తన ప్రేమను డయానాకు తెలియచేసాడు. డయానా అతని ప్రేమను అంగీకరించింది. 1981 ఫిబ్రవరి 24 న వారి నిశ్చితార్ధం జరిగింది. 1981 జూలై 29 న లండన్ లోని సెయింట్ పాల్ కాతేద్రాల్ లో జరిగింది.

వివాహం జరిగినప్పుడు డయానా వయసు 21 సంవత్సరాలు..కాగా చార్లెస్ కి 33 ఏళ్లు. వీరి విహాం ప్రపంచం అబ్బురపడే రీతిలో జరిగింది. వివాహ కార్యక్రమాన్ని బీబీసీ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం చేసింది. ఈ జంటకు ఇద్దరు కుమారులు ప్రిన్స్ విలియం, ప్రిన్స్ హర్రీ.


1997 ఆగస్టు 31 న పారిస్ లో ఒక కారు ప్రమాదంలో డయానా మరణించారు. అప్పటికే ఆమె ప్రిన్స్ చార్లెస్ నుంచి విడాకులు తీసుకున్నారు. డయానా మరణం ప్రపంచాన్ని దిగ్బ్రాంతికి గురిచేసింది. లక్షలాది మంది ఆమె మరణ వార్త విని కన్నీరు పెట్టుకున్నారు.


ప్రిన్సెస్ డయానా స్వేచ్చాజీవి. అన్నార్తులను చూసి చలించిపోయేవారు. అయితే రాజకుటుంబ పంజరంలో ఆమె ఇమడ లేకపోయారు. అంతేగాక భర్త చార్లెస్ కు గల స్త్రీ లోలత్వం వారి కాపురంలో కలతలు రేపింది. ఆమెను తీవ్ర మానసిక వేదనకు గురిచేసేది.

ఇదే సమయంలో బ్రిటిష్ టాబ్లయిడ్ పత్రికలు అనుక్షణం ఆమె వెంటపడి వేదించాయి.

ఆమె ఏం చేసినా ..ఎవరితో మాట్లాడినా గోరింతను కొండింతలు చేసి చూపించాయి. ఎంతో మందితో ఆమెకు సంబంధాలు అంటగట్టాయి.. వాటిని పూర్తిగా అసత్యం అనలేము ..

కానీ బ్రిటన్ లో నిత్యం ఆమె వ్యక్తి గతం జీవితానికి సంబంధించిన వార్తలపైనే చర్చి. చనిపోయేవరకు డయానాకు ఆ బాధ తప్పలేదు. అందుకే మృత్యు దేవత త్వరగా ఆమెను తన చెంతకు తీసుకువెళ్లింది..

రాజకుటుంబం పరువును వీధిన పడేసిందన్న కోపంతో వారే ఆమెను హత్య చేయింరాన్న వార్తలు కూడా అప్పట్లో బ్రిటన్ లో హల్ చల్ చేశాయి. కానీ ఏది నిజమో భగవంతునికే తెలుసు. ఎంత దర్యాప్తు చేసినా ఇప్పటికీ ఆమె మరణం ఒక మిస్టరీగానే మిగిలిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here